Srisailam: శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!

|

Jul 14, 2024 | 6:06 PM

పుణ్యక్షేత్రాలను వన్యప్రాణులు వీడటం లేదు. ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి చొరబడుతూ, కనిపించిన జంతువులను వేటాడుతున్నాయి. మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీశైలం లో అర్ధరాత్రి టోల్ గేట్ పక్కనే పడుకుని ఉన్న కుక్కపై ఎటాక్ చేసింది. మాటు వేసి కుక్కను వేటాడిన దృశ్యాన్ని భక్తులు కళ్లారా చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పుణ్యక్షేత్రాలను వన్యప్రాణులు వీడటం లేదు. ఆహారం కోసం అడవులను వదిలి జనావాసాల్లోకి చొరబడుతూ, కనిపించిన జంతువులను వేటాడుతున్నాయి. మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీశైలం లో అర్ధరాత్రి టోల్ గేట్ పక్కనే పడుకుని ఉన్న కుక్కపై ఎటాక్ చేసింది. మాటు వేసి కుక్కను వేటాడిన దృశ్యాన్ని భక్తులు కళ్లారా చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు చిరుతను వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేశారు. ఆహారం కోసం పక్కనే ఉన్న అడవి ప్రాంతం నుంచి చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది. గోడకి అవతల వైపున పడుకుని ఉన్న కుక్కను చూసిన చిరుత గోడచాటున నక్కి, అదనుచూసి కుక్కపై దాడిచేసి ఎత్తుకెళ్లిపోయింది. అటుగా కార్లలో శ్రీశైలం వెళ్తున్న భక్తులు ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవిశాఖ సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించారు. రాత్రుల సమయంలో స్దానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మహానంది ఆలయం చుట్టూ గత 20 రోజులుగా చిరుత పులి సంచరిస్తోంది. కుక్కలు పందులను దాడిచేసి ఎత్తుకెళ్లిపోతోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.