అయ్యో.. ఈ చిరుతకు ఎంత కష్టం వచ్చిందో

కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అని నానుడి. కానీ కష్టాలు మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తాయి. చిన్న చిన్న జంతువులకు పెద్ద జంతువులనుంచి కష్టాలు కామన్‌. కానీ అడవినే హడలెత్తించే పులులు, సింహాలు వంటివి కూడా ఒక్కోసారి కష్టాల్లో పడతాయి. తాజాగా ఓ చిరుతకు పాపం చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. ఇటీవల వన్యప్రాణులు ఆహారం కోసమో, నీటికోసమో జనావాసాల్లోకి రావడం పరిపాటి అయిపోయింది.

అయ్యో.. ఈ చిరుతకు ఎంత కష్టం వచ్చిందో

|

Updated on: Mar 07, 2024 | 9:08 PM

కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అని నానుడి. కానీ కష్టాలు మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తాయి. చిన్న చిన్న జంతువులకు పెద్ద జంతువులనుంచి కష్టాలు కామన్‌. కానీ అడవినే హడలెత్తించే పులులు, సింహాలు వంటివి కూడా ఒక్కోసారి కష్టాల్లో పడతాయి. తాజాగా ఓ చిరుతకు పాపం చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. ఇటీవల వన్యప్రాణులు ఆహారం కోసమో, నీటికోసమో జనావాసాల్లోకి రావడం పరిపాటి అయిపోయింది. అలా ఓ చిరుత ఓ పశువుల కొట్టాంలోకి చొరబడింది. ఆవులను వేటాడటానికే వెళ్లిందో.. లేక దాహం వేసి నీళ్లు దొరుకుతాయేమోనని వెళ్లిందో కానీ పాపం ఓ కుండలో తలపెట్టి ఇరుక్కుపోయింది. ఇక ఆ చిరుత కష్టాలు చెప్పేదేముంటుంది? మహారాష్ట్రంలోని ధులే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశువులను కట్టే షెడ్‌లోకి వెళ్లిన చిరుతకు అక్కడ పశువులేమీ కనబడలేదు. దాంతో నీళ్లుకతాగి కడుపునింపుకుందామనుకుని అ్కడే ఉన్న లోహపు కుండలో తల పెట్టింది. అంతే తల అందులో ఇరుక్కుపోయింది. తలను బయటకు తీయడానికి ఆ చిరుత కుండతో అటూ ఇటూ పరుగెత్తి గోడకు గుద్దుకుని నానా హంగామా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

8 నిమిషాల్లో.. 100 పద్యాలు.. అబ్బురపరుస్తున్న ఎనిమిదోతరగతి విద్యార్థిని

రూ.10లతో కూడా బంగారం కొనవచ్చు.. మధ్యతరగతివారికి మంచి అవకాశం

నా మొగుడు తాగుడు మానేసేలా చూడు సమ్మక్క.. హుండీలో చిత్రమైన లెటర్

అసలు కోలీవుడ్ హీరోలకేమైంది ?? విజయ్‌ వెనకే వెళుతున్న సూర్య

Nivetha Pethuraj: నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? వారిపై సీరియస్ అయిన హీరోయిన్

Follow us