8 నిమిషాల్లో.. 100 పద్యాలు.. అబ్బురపరుస్తున్న ఎనిమిదోతరగతి విద్యార్థిని

8 నిమిషాల్లో.. 100 పద్యాలు.. అబ్బురపరుస్తున్న ఎనిమిదోతరగతి విద్యార్థిని

Phani CH

|

Updated on: Mar 07, 2024 | 9:07 PM

ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక తన అద్భుత ప్రతిభను చాటుతూ ఔరా అనిపించింది. తెలుగులో పధ్యాలను తప్పులు లేకుండా గుక్క తిప్పుకోకుండా చదువుతూ అబ్బురపరిచింది. కేవలం 8 నిమిషాల్లో 100 పధ్యాలో అలవోకగా చదివేసింది. ఈ బాలిక ట్యాలెంట్‌ను చూసి ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు ముగ్ధులైపోతున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నర్రాగుల భవాని వేమన శతక పద్యాలు చదవడంలో దిట్ట.

ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక తన అద్భుత ప్రతిభను చాటుతూ ఔరా అనిపించింది. తెలుగులో పధ్యాలను తప్పులు లేకుండా గుక్క తిప్పుకోకుండా చదువుతూ అబ్బురపరిచింది. కేవలం 8 నిమిషాల్లో 100 పధ్యాలో అలవోకగా చదివేసింది. ఈ బాలిక ట్యాలెంట్‌ను చూసి ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు ముగ్ధులైపోతున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నర్రాగుల భవాని వేమన శతక పద్యాలు చదవడంలో దిట్ట. వంద పద్యాలు అలవోకగా తప్పుల్లేకుండా 8 నిమిషాల్లో చదివేస్తోంది. దోమకొండకు చెందిన నర్రాగుల కళావతి-నర్సింలుల కూతురు భవాని. ఏడాది క్రితం స్థానిక పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయురాలు ఆకారం ఉమారాణి వేమన శతకం పుస్తకాలను పలువురు విద్యార్థినులకు అందజేసింది. వేమన పద్యాల కంఠస్థం, అందులోని భావాన్ని అర్థం చేసుకుని జీవితంలో మసులుకోవాలని సూచించారు. తెలుగుపై ఉన్న ఆసక్తితో వేమన శతకంలోని వంద పద్యాలను కేవలం రెండు నెలల్లోనే కంఠస్థం చేసుకుని, వేగంగా చదవడానికి ప్రయత్నించింది చిన్నారి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.10లతో కూడా బంగారం కొనవచ్చు.. మధ్యతరగతివారికి మంచి అవకాశం

నా మొగుడు తాగుడు మానేసేలా చూడు సమ్మక్క.. హుండీలో చిత్రమైన లెటర్

అసలు కోలీవుడ్ హీరోలకేమైంది ?? విజయ్‌ వెనకే వెళుతున్న సూర్య

Nivetha Pethuraj: నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు? వారిపై సీరియస్ అయిన హీరోయిన్

Tamannaah Bhatia: ఓ ఫ్యాన్ ట్వీట్‌కి ఉబ్బితబ్బిబైన తమన్నా..