ప్రతి ఇంటి ముందు ఓ కొండముచ్చు ఫ్లెక్సీ.. ఎందుకలా ??
కరీంనగర్ ను కోతులు చుట్టుముట్టేస్తున్నాయి..పట్టణమంతా వీరంగాన్ని సృష్టిస్తున్నాయి....గుంపుగుంపులుగా వెళ్తూ నగరవాసులకి చెమటలు పట్టిస్తున్నాయి...కోతులు చేస్తున్న హాల్ చల్ కి చెక్ పెట్టెందుకు కొండముచ్చుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు నగరవాసులు. ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్తా ఊపిరి పీల్చుకొని ఎలాంటి భయం లేకుండా ఇంట్లో కి వెళుతున్నామని అంటున్నారు.
రెండు దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారం వేగంగా విస్తరించింది. దీంతో కొండలన్నీ కరిగిపోయాయి. ఈక్రమంలో కొండలలో ఉండే కోతులన్నీ నగరంలోకి ప్రవేశించాయి…ఇప్పుడు వాడవాడలా కోతుల ఖ్య పెరిగిపోయింది. భగత్ నగర్ ,తిరుమలనగర్, లక్ష్మీనగర్ ,హౌజింగ్ బోర్డు కాలనీలలో వీటి సంచారం ఎక్కువగా ఉన్నది. లక్ష్మీనగర్ లో గేట్ల పైనే తిష్టవేసి ఎటూ వెళ్ళాకుండా యజమానులను భయపెట్టిస్తున్నాయి. గతంలో కొన్ని రోజులు కొండముచ్చును తిప్పారు. అప్పుడు తాత్కలిక విముక్తి లభించింది. అయితే అ కొండముచ్చును మెయింటనెన్స్ చేయలేకపోవడంతో అక్కడి నుండి తరలించారు. కొండముచ్చు స్థానంలో కొండముచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ వాసులు నిర్ణయించారు. దీనితో ప్రతి ఇంటి గేటు ఎదుట కొండముచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. గత వారం రోజుల నుండి కూడా కోతుల సంచారం తగ్గింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంటి మమ్మి ఇలా ఉన్నారు.. వాట్సాప్ ద్వారా బ్యాంకు మేనేజర్‌నే ముంచేశాడు..
సైనికుల ముఖాలను గుర్తుపట్టకుండా కాల్చేస్తున్న పుతిన్ సేనలు
టీ కప్పు గాడిద పాల రేటు ఎంతో తెలిస్తే మతిపోవడం ఖాయం !!
Rashmika: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్.. మీకు అర్థమవుతోందా ??