Viral: ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..

|

Dec 05, 2024 | 5:55 PM

తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్న సామెత ఊరికే రాలేదు. ఎవరైనా వింత చేష్టలు చేస్తుంటే కోతి చేష్టలని అంటుంటాం. ఈ సామెతలను నిజం చేసింది ఈ వానరం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో ఓ కొండముచ్చు స్వైర విహారం చేస్తోంది. కనిపించిన మేకలను చంపేస్తుంది. కుక్క ఇంకా పిల్లి పిల్లలను చెట్ల పైకి ఎత్తుకెళ్ళిపోతుంది. దీంతో మొగల్తూరు గ్రామస్థులు బేంబేలెత్తిపోతున్నారు.

మొగల్తూరులోని కొట, పాలకమ్మ చెరువు, గొడవారి పాలెం, గొల్లవారి గూడెంలో గత కొన్ని రోజులుగా కొండముచ్చు.. తన వింత చేష్టలతో ఊరి జనాన్ని భయపెడుతోంది. తమ గుంపు నుంచి విడిపోయిందో లేక ఒంటరిది అయిపోవడం వలనో తెలియదు కానీ హింసాత్మక చేష్టలతో గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. వారం రోజులలో కొన్ని మేక పిల్లలను చంపేసింది. కుక్క, పిల్లి పిల్లలను చెట్టు పైకి తీసుకుపోయి అక్కడ పెట్టడం తో చిన్న పిల్లలను కూడా అలా ఎత్తుకెళుతుందేమో అని గ్రామస్థులు వణికిపోతున్నారు. పిల్లలను స్కూలుకి పంపాలన్నా భయపడుతున్నారు గత వారం రోజులు గా ఆ ప్రాంతంలోని స్కూల్ అధ్యాపకులు బిక్కుబిక్కు మంటూ పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. తరగతి గది తలుపులు మూసేసి మరీ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. కొండముచ్చుని తరిమేయడానికి స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి ఆ ప్రాంతంలోనే అది కనిపించడంతో స్థానికులు భయపడిపోతున్నారు. అయినా కొండముచ్చు ఎక్కడైనా కోతులను భయపెడతాయి.. కాని ఈ కొండముచ్చు ఏకంగా ఈ ఊరినే టెన్షన్ పెడుతోంది. అందుకే అటవీశాఖ అధికారులు.. కొండముచ్చు ని బంధించాలని మొగల్తూరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.