Kulhad Chai: వణికించే చలిలో.. పొగలు కక్కే కుల్హాడ్ చాయ్.. రుచి, ఆరోగ్యంలో అమోఘం.. వీడియో.
శీతాకాలపు ఉదయాలు చాలా మనోహరంగా ఉంటాయి. వణికించే చలితో పాటు.. పొగలు కప్పే టీ, కాఫీలు మనల్ని రా రమ్మని ఊరిస్తూ ఉంటాయి. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ
శీతాకాలపు ఉదయాలు చాలా మనోహరంగా ఉంటాయి. వణికించే చలితో పాటు.. పొగలు కప్పే టీ, కాఫీలు మనల్ని రా రమ్మని ఊరిస్తూ ఉంటాయి. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ వేడి వేడి టీ లేదా కాఫీ ని సిప్ చేస్తే ఆ హాయే వేరు. మన దేశంలో టీ రకాలకు కొదవే లేదు. ముఖ్యంగా తందూరీ చాయ్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. వేడిగా పొగలు కక్కుతున్న టీని అంతకంటే వేడిగా ఉన్న మట్టి కుండలో పోసి సర్వ్ చేసిన టీ రుచి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కొన్ని ప్రాంతాల్లో మట్టితో చేసిన కప్పుల్లోనూ టీ అందిస్తుంటారు. దీని వల్ల వినియోగదారులకు మాత్రమే కాకుండా దుకాణ యజమానులకు కూడా ప్రయోజనం. ఎందుకంటే మట్టితో చేసిన కప్పులు పర్యావరణానికి మంచివి. మట్టికప్‌లో చాయ్ తాగడం వల్ల మానసికంగా ఆనందంగా ఉండటమే కాకుండా అద్భుతమైన శారీరక ప్రయోజనాలూ అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పేగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం అంటున్నారు. ఇది ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. ప్లాస్టిక్ కప్పులు లేదా శుభ్రం చేయని గ్లాసుల్లో టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. కానీ మట్టికప్పుల ద్వారా ఆ సమస్యలు వచ్చే అవకాశం లేదు. వీటిలో ఉండే ఆల్కలీన్ జీర్ణాశయంలో ఆమ్లాల అధిక ఉత్పత్తిని నిరోధిస్తుంది. ప్లాస్టిక్ కప్పులలో టీ తాగడం ద్వారా పొట్టకు హాని కలిగించే రసాయనాలు శరీరంలోకి వస్తాయి. అదే మట్టి పాత్రలో టీ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయన్న భయం లేకుండా హాయిగా టీ ఆస్వాదించవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

