బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్‌

Updated on: Jan 07, 2026 | 5:52 PM

కడప జిల్లాలోని కొనరాజుపల్లిలో ఓ బాలుడికి వచ్చిన కల నిజమైంది. గుట్టపై పుట్టలో దైవ విగ్రహాలున్నాయని బాలుడు చెప్పడంతో గ్రామస్తులు తవ్వకాలు జరిపి నరసింహస్వామి, ఆంజనేయ, లక్ష్మిదేవి పంచలోహ విగ్రహాలను కనుగొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. అయితే, కొందరు గ్రామస్తులు దీనిని ప్రీ-ప్లాన్డ్ డ్రామాగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

ఊరు చివర గుట్ట…గుట్ట మీద పుట్ట..పుట్టలో దేవుడు ఉన్నాడంటూ ఓ బాలుడు తనకొచ్చిన కల గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాడు. ఆ మాట ఊరంత పాకి.. ఊరి జనమంతా ఊరిచివర ఉన్న గుట్టమీదికి చేరారు. పలుగుపార చేతపట్టి ఆ ప్రాంతమంతా గాలించారు. చివరికి బాలుడు చెప్పిన ఆనవాళ్లున్న చోట తవ్వగానే…విగ్రహాలు బయటపడ్డాయి. మొన్న మంచిర్యాలలో ఇలాంటి ఘటనే జరగగా, నేడు కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద గల కొనరాజుపల్లిలో ఈ ఘటన జరిగింది. దేవతా విగ్రహాలు చూసిన జనం.. భక్తితో పూజలు చేస్తున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గర ఉన్న కొనరాజుపల్లిలో హరికృష్ణ అనే బాలుడికి దేవుడు కలలోకి వచ్చాడట. ఊరి శివార్లలోని గుట్టమీది పుట్టలో తాను ఉన్నట్లు దేవుడు చెప్పాడు. దీంతో అంతా ఏకమై పుట్టను కదిలించి చూడగా, నరసింహస్వామి, హనుమాన్‌, లక్ష్మిదేవి పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. అయితే మరో రెండు విగ్రహాలు కూడా ఉన్నాయని ఆ బాలుడు చెబుతున్నాడు. విగ్రహాలకు అభిషేకాలు, పూజలు చేస్తున్న ప్రజలు….పనిలో పనిగా బాలుడికి కూడా పూజలు చేయడం మొదలుపెట్టారు. దైవవాక్కుగా భావించి అతడ్ని కొలుస్తున్నారు. అయితే ఇదంతా ప్రీప్లాన్డ్ డ్రామా అయి ఉండొచ్చని మరికొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు

ప్రింటింగ్‌ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్

దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి

సర్పంచ్‌ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్‌

TTD: ఇకపై శ్రీవారి భక్తుల చెంతకే జల ప్రసాదం..