Petrol Bunk Free: ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..

|

Dec 11, 2024 | 11:04 AM

వాహనం కలిగిన ప్రతీఒక్కరూ తమ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌కు తప్పనిసరిగా వెళుతుంటారు. అయితే ఇలా వెళ్లేవారిలో చాలా మందికి అక్కడ లభించే ఉచిత సర్వీసులు గురించి ఏమాత్రం తెలియదు. వినియోగదారుల వాహన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను పెట్రోల్‌ బంక్‌లు అందిస్తాయి. అవేమిటో వాహనదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. పెట్రోల్‌ బంక్‌ల వద్ద ఉచితంగా వాహనాల టైర్లలో గాలికొట్టించుకోవచ్చు.

పెట్రోల్ బంక్‌లో మంచినీటి సౌకర్యం కూడా ఉచితం. చాలా బంకులలో వాటర్ కూలర్ సదుపాయం కూడా ఉంటుంది. తద్వారా వాహన వినియోగదారులు చల్లని, పరిశుభ్రమైన నీటిని తాగవచ్చు. వాహనదారులుతమ ప్రయాణంలో వాష్‌రూమ్ అవసరమైన సందర్భంలో పెట్రోల్ బంక్‌లోని వాష్‌రూమ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ఉచిత సౌకర్యాల కోసం ఏ బంక్‌లోనైనా డబ్బులు వసూలు చేస్తే ఉన్నతాధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు.

వాహనదారులకు ఏదైనా గాయం అయినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సులోని మందులను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ బాక్సులోని మందులు గడువు ముగియనివి అయి ఉండాలని గుర్తుంచుకోండి. పెట్రోల్ బంక్‌ యజమానులు ప్రథమ చికిత్స బాక్సులలోని మందులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. ఏవో కారణాలతో వాహనంలో పెట్రోల్ నింపుతున్నప్పుడు మంటలు అంటుకుంటే, అదే బంక్‌లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. పెట్రోల్ బంక్‌లో ఈ సౌకర్యాలు ఉచితంగా అందించకపోయినా, లేదా ఇందుకోసం ఛార్జీలు విధించినా వినియోగదారులు ఆ పెట్రోలియం కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి, దానిలో ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.