నెటిజన్లను వణికిస్తున్న భారీ కింగ్ కోబ్రా..
నెట్టింట ఓ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అంత భారీ సైజులో ఉంది ఆ కింగ్ కోబ్రా.
నెట్టింట ఓ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అంత భారీ సైజులో ఉంది ఆ కింగ్ కోబ్రా. సాధారణంగా మన ప్రాంతాల్లో కనిపించే కింగ్ కోబ్రాలు 10 అడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ కింగ్ కోబ్రా ఏకంగా 20 అడుగుల పైనే ఉంది. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న కింగ్ కోబ్రాను ఇప్పటి వరకూ చూసి ఉండం. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇందులో కింగ్ కోబ్రా ఓ రోడ్డు పక్కన పది అడుగుల మేర పైకి లేచి నిలబడి చుట్టూ గమనిస్తూ ఉంది. ఈ పాము తన శరీరంలో మూడింట ఒకటో వంతు వరకు నిలబడగలదని, ఎదురుగా ఉన్న వ్యక్తి కళ్లల్లోకి చూడగలదని నందా వెల్లడించారు. ఈ వీడియో పై సింహ అనే ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ ‘‘నేను, మా నాన్న కొన్నేళ్ల క్రితం ఊళ్లో ఇలాంటి కోబ్రాను చూసి వణికిపోయాం. వెనుదిరిగి పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాం’’అని కామెంట్ చేశాడు. సుశాంత నందా అటవీ జంతువుల గురించి ఇలా అరుదైన విశేషాలను తరచూ ట్విట్టర్ పై షేర్ చేస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కియా కారులో వచ్చి పట్టపగలు చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా ??