Gold Smuggling: కారు హ్యాండ్‌ బ్రేక్‌ కింద.. కేజీల కొద్దీ బంగారం.! ఇదేం తెలివిరా అయ్యా..

|

Aug 05, 2024 | 8:36 AM

గోల్డ్ స్మగ్లింగ్ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు మాత్రం పుష్ప రేంజ్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా కారు హ్యాండ్‌ బ్రేక్‌ వద్ద ప్రత్యేక అర ఏర్పాటు చేసి గోల్డ్ తరలిస్తుండగా, పంతంగి టోల్‌ ప్లాజా వద్ద డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ.. రూ.2,51,46,310గా తేల్చారు. హ్యాండ్‌ బ్రేక్‌ కింద దాచిపెట్టిన 3,577 గ్రాముల విదేశీ బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు..

గోల్డ్ స్మగ్లింగ్ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు మాత్రం పుష్ప రేంజ్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా కారు హ్యాండ్‌ బ్రేక్‌ వద్ద ప్రత్యేక అర ఏర్పాటు చేసి గోల్డ్ తరలిస్తుండగా, పంతంగి టోల్‌ ప్లాజా వద్ద డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ.. రూ.2,51,46,310గా తేల్చారు. హ్యాండ్‌ బ్రేక్‌ కింద దాచిపెట్టిన 3,577 గ్రాముల విదేశీ బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు.. డీఆర్‌ఐ అధికారులు ప్రకటన విడుదల చేశారు. అక్రమంగా బంగారం రవాణాకు యత్నించిన ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని బీదర్‌కు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. బంగారంతో పాటు కారును సీజ్ చేశారు డీఆర్‌ఐ అధికారులు.

పక్కా సమాచారంతో హైదరాబాద్‌ డీఆర్‌ఐ అధికారులు గోల్డ్ రవాణా చేస్తున్న కారును పట్టుకోగలిగారు. ఈ సరుకు వెనుక అసలు కథేంటి? ఎవరు..ఎవరికి..ఎందుకోసం దొంగదారిలో దర్జాగా బంగారాన్ని తరిలిస్తున్నారు అన్నది తేలాల్సి ఉంది. హైదరాబాద్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ సెంటర్‌గా మారిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమతుున్నాయి. వయా ORR..విజయవాడ, చెన్నై, బెంగళూరుకు గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నారు. అమాయకులను వాహకులగా చేసుకుని. వేలాది రూపాయల డబ్బు ఆశ చూపి.. స్మగ్లింగ్ ఊబిలోకి దించేస్తారు. అందుకే డబ్బుకు ఆశపడి ఇలాంటి తప్పుడు మార్గాల్లోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on