Viral Video: పాస్‌పోర్ట్ కవర్ బుక్ చేస్తే పాస్‌పోర్టే వచ్చింది.. వీడియో
‘ఒకటి బుక్ చేస్తే.. మరొకటి వచ్చింది’ అంటూ ఇటీవల కాలంలో ఈ-కామర్స్‌లో ఆర్డర్స్ పెట్టి.. ఆశ్చర్యపోయిన వారి గురించి వింటూనే ఉన్నాం. కస్టమర్స్ ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలకు కంప్లైంట్ చేయడమే కాదు..
‘ఒకటి బుక్ చేస్తే.. మరొకటి వచ్చింది’ అంటూ ఇటీవల కాలంలో ఈ-కామర్స్‌లో ఆర్డర్స్ పెట్టి.. ఆశ్చర్యపోయిన వారి గురించి వింటూనే ఉన్నాం. కస్టమర్స్ ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలకు కంప్లైంట్ చేయడమే కాదు.. సరదాగా నెట్టింట్లోనూ షేర్ చేస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. కేరళలోని వయనాడ్‌కి చెందిన మిథున్ బాబు అనే ఓ వ్యక్తి సెప్టెంబర్ 30న అమెజాన్‌లో పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ పెట్టాడు. రెండు రోజుల్లో అది డెలివరీ కాగా.. తెరిచి చూడగానే ఒక్కసారిగా అందులో ఉన్న విలువైన వస్తువును చూసి ఖంగుతిన్నాడు. బుక్ చేసింది పాస్‌పోర్ట్ కవర్ అయితే అందులో ఉన్నది మాత్రం వేరొకరి ఒరిజినల్ పాస్‌పోర్ట్ కావడమే అందుకు కారణమట.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: 13 ఏళ్ల కూతురితో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు చేయించిన తల్లి !! చివరికి ?? వీడియో