బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం

Updated on: Jan 11, 2026 | 12:51 PM

కేరళలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన అనిల్ కిషోర్ అనే బిచ్చగాడి వద్ద రూ.4.5 లక్షలకు పైగా నగదు లభించింది. ఇందులో రద్దైన రూ.2000 నోట్లు, విదేశీ కరెన్సీ కూడా ఉన్నాయి. అతడి మరణం, అతని వద్ద దొరికిన డబ్బు స్థానికులను, పోలీసులను షాక్ గురిచేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేరళలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అందరూ ఒక సామాన్య బిచ్చగాడు అనుకున్న వ్యక్తి వద్ద లక్షలాది రూపాయలు బయటపడటంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. చారుమ్మూడ్ ప్రాంతంలో అనిల్ కిషోర్ అనే వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న అనిల్ ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. కానీ, అతడు మరుసటి రోజు ఉదయం ఒక దుకాణం ముందు శవమై కనిపించాడు. అనంతరం పోలీసులు అతని పక్కనే పడిన ప్లాస్టిక్ డబ్బాలను తెరిచి చూడగా ఆ డబ్బాలలో చిన్న చిన్న కట్టలుగా కట్టిన కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. పోలీసులు ఆ నగదును లెక్కించగా ఏకంగా రూ. 4.5 లక్షలకు పైగా ఉన్నట్లు తేలింది. అందులో ప్రభుత్వం రద్దుచేసిన రూ. 2,000 నోట్లతో బాటు కొంత విదేశీ కరెన్సీ కూడా ఉండటంతో పోలీసులు షాకయ్యారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రి నుంచి పారిపోయి, చివరకు విగతజీవిగా పడిన అనిల్‌కు వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు , అతనికి ఎవరైనా వారసులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రోజూ తిండి ఖర్చుల కోసం అడుక్కునే అనిల్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం చూసి షాకైనట్లు పంచాయతీ సభ్యుడు తెలిపారు. అతడి దగ్గర అంత డబ్బు ఉందని ఎవరూ ఊహించలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ డబ్బును కోర్టుకు అప్పగిస్తామని, అతడి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినా రాకపోయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

ప్రపంచంలోనే తొలి క్లోన్‌ వరి వంగడం

కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం

సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం రైల్వేస్టేషన్లు,బస్‌స్టేషన్లు రద్దీ

వాట్సాప్‌లో హాయ్‌ అంటే.. FIR కాపీ ఓయ్‌ అంటుంది