ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో హౌసింగ్ మంత్రి వ్యవహరించిన తీరు అందరిని షాక్‌కు గురిచేసింది. అయితే బాధితురాలు మాత్రం మంత్రి తనను కొట్టలేదని.. తనకు స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చామరాజనగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమిపట్టాల పంపిణీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక భూ రెవెన్యూ చట్టం 94సీ కింద భూములను క్రమబద్ధీకరించి 175 మందికి పట్టాలు ఇచ్చారు. అయితే, తనకు భూమి అందకపోవడంతో ఓ మహిళ ఆందోళనకు గురైంది. అధికారులను నిలదీస్తూ మంత్రి వద్దకు ఆమె వెళ్లగానే సోమన్న ఆమె చెంపచెళ్లుమనించారు. ఆ వెంటనే మంత్రి కాళ్లు పట్టుకుంది ఆ మహిళ. తనకు న్యాయం చేయాలని కోరింది. అనంతరం ఆమెకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.