Lottery: ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!

Lottery: ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!

Anil kumar poka

|

Updated on: Oct 12, 2024 | 7:57 PM

కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్‌కు జాక్‌పాట్ త‌గ‌ల‌డంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కర్ణాటకకు చెందిన అల్తాఫ్ అనే మెకానిక్ కేరళ తిరువోణం బంపర్ లాటరీలో లక్కీ విన్నర్‌గా నిలిచాడు. దాంతో అత‌డి బ్యాంక్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ. 25కోట్లు వ‌చ్చి చేరాయి. అత‌డు కొనుగోలు చేసిన లాట‌రీ టికెట్ పాతిక కోట్ల న‌గ‌దు బహుమతిని తెచ్చిపెట్టింది. తిరువ‌నంత‌పురంలోని గోర్కీ భ‌వ‌న్‌లో..

కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్‌కు జాక్‌పాట్ త‌గ‌ల‌డంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కర్ణాటకకు చెందిన అల్తాఫ్ అనే మెకానిక్ కేరళ తిరువోణం బంపర్ లాటరీలో లక్కీ విన్నర్‌గా నిలిచాడు. దాంతో అత‌డి బ్యాంక్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ. 25కోట్లు వ‌చ్చి చేరాయి. అత‌డు కొనుగోలు చేసిన లాట‌రీ టికెట్ పాతిక కోట్ల న‌గ‌దు బహుమతిని తెచ్చిపెట్టింది. తిరువ‌నంత‌పురంలోని గోర్కీ భ‌వ‌న్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో డ్రా నిర్వహించ‌గా అల్తాఫ్‌ను లాట‌రీ వ‌రించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్లడించారు.

ఇక త‌న‌కు ఈ భారీ జాక్‌పాట్ త‌గ‌ల‌డం ప‌ట్ల అల్తాఫ్ ఆనందం వ్యక్తం చేశాడు. గత 15 ఏళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇన్నాళ్లకు తనను అదృష్టం వరించిందిని అల్తాఫ్‌ తెలిపాడు. ఈ ప్రైజ్‌ మనీతో త‌న పిల్లల పెళ్లి ఘ‌నంగా జ‌రిపిస్తాన‌ని అత‌డు చెప్పుకొచ్చాడు. తాను ఈ ల‌క్కీ టికెట్‌ను సుల్తాన్ బాత్‌రే పరిధిలోని ప‌నామార‌మ్‌లో ఉన్న ఎస్‌జే ల‌క్కీ సెంట‌ర్‌లో కొనుగోలు చేసిన‌ట్లు తెలిపాడు. కాగా కేరళకు చెందిన తిరువోణం బంపర్‌ లాటరీ ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ ఇస్తుంది. గ‌తేడాది ఈ బంప‌ర్ లాట‌రీని సంయుక్తంగా న‌లుగురు గెలుచుకున్నారు. త్రిసూర్‌, త‌మిళ‌నాడుకు చెందిన‌ న‌లుగురు వ్యక్తుల‌కు ఈ లాట‌రీ విజేత‌గా నిలిచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.