కన్నడ భాషలో డాక్టర్ల మందుల చీటీలు.. నెట్టింట వైరల్‌

|

Sep 25, 2024 | 9:24 PM

కర్ణాటకలోని కొంతమంది డాక్టర్లు కన్నడ భాషలో రాస్తున్న ప్రిస్క్రిప్షన్‌ల ఫొటోలు వైరల్‌గా మారాయి. కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన సంజయ్ రాఘవేంద్ర అనే ఆర్థోపెడిక్‌ వైద్యుడు, హోసంగడికి చెందిన డెంటల్ డాక్టర్‌ మురళి, ఇతర వైద్యులు తమ దగ్గరకు వచ్చిన రోగులకు కన్నడలో రాస్తున్న మందుల చీటీలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

కర్ణాటకలోని కొంతమంది డాక్టర్లు కన్నడ భాషలో రాస్తున్న ప్రిస్క్రిప్షన్‌ల ఫొటోలు వైరల్‌గా మారాయి. కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన సంజయ్ రాఘవేంద్ర అనే ఆర్థోపెడిక్‌ వైద్యుడు, హోసంగడికి చెందిన డెంటల్ డాక్టర్‌ మురళి, ఇతర వైద్యులు తమ దగ్గరకు వచ్చిన రోగులకు కన్నడలో రాస్తున్న మందుల చీటీలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. దీనిపై కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ పురుషోత్తం బిలిమల్ మాట్లాడుతూ , వీరు కన్నడలో ప్రిస్క్రిప్షన్‌ను అందంగా రాశారనీ వారిని అభినందిద్దాం అంటూ రాసుకొచ్చారు. నెటిజన్లు కూడా వైద్యులను అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు కన్నడలో ప్రిస్క్రిప్షన్‌ రాయడాన్ని తప్పనిసరి చేయాలని కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, తాలూకా, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు మందు చీటీలు రాసేటప్పుడు కన్నడ భాషకు ప్రాధాన్యం ఇస్తే, తమ భాషను మనం పరిరక్షించుకోవడానికి ఓ ముందడుగు వేసినట్లు అవుతుందని, తమ అభ్యర్థనను పరిశీలించి కన్నడలో ప్రిస్క్రిప్షన్‌లను తప్పనిసరి చేయాలని కేడీఏ ఛైర్మన్‌ బిలిమల్‌ కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్ గుండురావును కోరారు. అంతేకాకుండా రాష్ట్ర భాషను ప్రోత్సహిస్తున్న వైద్యులను గుర్తించి ఏటా వైద్యుల దినోత్సవం రోజున వారిని సత్కరించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు ఈ విధానాన్ని పాటించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అలాంటి SMSలను నమ్మితే.. మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ !!

స్టార్ హెల్త్‌ లో పాలసీ ఉందా ?? మీ డేటా డౌటే !!

స్టార్‌ హోటల్‌కెళ్లి.. చెయ్యకూడని పని చేస్తే

వ్యాక్సిన్స్‌ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి కాస్తా.. ఇలా !!

అదో దొంగల స్కూల్.. చోరీ ఎలా చేయాలో క్లాసులు చెబుతున్న క్రిమినల్స్‌

Follow us on