‘మాస్టారూ.. మాకు మీరే కావాలి’.. కన్నీటిపర్యంతమైన హెడ్‌మాస్టారు !!

‘మాస్టారూ.. మాకు మీరే కావాలి’.. కన్నీటిపర్యంతమైన హెడ్‌మాస్టారు !!

Phani CH

|

Updated on: Nov 11, 2022 | 9:17 AM

కొందరు ఉపాధ్యాయులు తమ బోధనా విధానంతో, విద్యార్ధుల పట్ల తమ ప్రవర్తనతో విద్యార్ధుల మనసు గెలుచుకుంటారు. అలాంటి ఉపాధ్యాయులను విద్యార్ధులు ఎంతగానో గౌరవిస్తారు, ప్రేమిస్తారు.

కొందరు ఉపాధ్యాయులు తమ బోధనా విధానంతో, విద్యార్ధుల పట్ల తమ ప్రవర్తనతో విద్యార్ధుల మనసు గెలుచుకుంటారు. అలాంటి ఉపాధ్యాయులను విద్యార్ధులు ఎంతగానో గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అలాంటి ఓ టీచర్‌ బదిలీపై తమను వదిలి వెళ్లిపోతున్నారని తెలిసి ఆ విద్యార్ధులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన చుట్టూ చేరి తమను వదిలి వెళ్లొద్దంటూ బావురుమన్నారు. ఈ అపూర్వ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేశారు నాగేశ్వరరావు. అయితే ఆయన అక్కడ పనిచేసింది కేవలం ఏడాది కాలం మాత్రమే. అయినా ఆయన విద్యాబోధన, పిల్లలకు పెట్టే భోజనం ఇలా అన్నింటిలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్ధుల మనసులో చోటు సంపాదించుకున్నారు. అయితే ఆయనకు మరోచోటికి బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. దాంతో విద్యార్ధినిలంతా ఆ హెడ్‌మాస్టారి చుట్టూ చేరి భోరున విలపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చావును జయించిన హీరో – హీరోయిన్ ప్రేమ!

Rashmika Mandanna: పాపం !! ఈమె బాధను కామెడీ చేశారుగా !!

ఆ ఒక్క నిర్ణయం.. ఈ హీరో జీవితాన్నే మార్చనుంది ??

ఆమెకు 50.. అతనికి 37.. ముదిరిన ప్రేమతో పెళ్లికి రెడీఅట !!

TOP 9 ET News: అడివి శేష్‌కు షాకిచ్చిన యూట్యూబ్‌.. మళ్లీ వస్తున్న బాద్‌షా

 

Published on: Nov 11, 2022 09:17 AM