ఆమెకు 50.. అతనికి 37.. ముదిరిన ప్రేమతో పెళ్లికి రెడీఅట !!
ఈడూ జోడూ.. వయసూ.. వరుస పట్టించుకోకుండా.. ఎఫైర్లు పెట్టుకోవడం.. ప్రేమాయణాలు మొదలెట్టడం.. సహజీవనం పేరుతో కాపురాలు చేయడం..
ఈడూ జోడూ.. వయసూ.. వరుస పట్టించుకోకుండా.. ఎఫైర్లు పెట్టుకోవడం.. ప్రేమాయణాలు మొదలెట్టడం.. సహజీవనం పేరుతో కాపురాలు చేయడం.. బాలీవుడ్ లో షరా మామూలు అయిపోయింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటున్నాం అంటూ.. నెట్టింట అనౌన్స్ చేయడం.. హడావిడి చేయడం.. ఇదెక్కి విడ్డూరం రా.. బాబు అంటూ అందరూ తలలు పట్టుకునేలా చేయడం కూడా కామన్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఇదే కామన్ థింగ్‌తో మేం కూడా పెళ్లికి రెడీ అయిపోయాం అని అంటున్నారు మలైకా అండ్ అర్జున్. ఎస్ ! 50 ఏళ్ల వయసులో.. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల సమక్షంలో.. తన వయసులో సంగం వయసు ఉన్న అర్జున్‌తో ఎప్పుడో ప్రేమలో పడింది మలైకా. ఆ తరువాత ఆమె.. తన ముదిరిన ప్రేమతో.. అర్జున్‌తో సహజీవనం చేస్తూ వస్తోంది. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్ సైజ్‌లంటూ.. వీకెండ్ పార్టీలంటూ.. బీచ్ స్నానాలంటూ.. అర్జున్ ను పట్టుకుని తెగ తిరిగింది. ఇక వీరి ప్రేమ పాకాన కూడా పడడంతో.. అర్జున్‌తో పెళ్లికి రెడీ అయిపోయింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా తన ట్విట్టర్ వేదికగా.. ఓ చిన్న హింట్‌తో అందరికీ తెలిసేలా చేసింది. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అడివి శేష్‌కు షాకిచ్చిన యూట్యూబ్.. మళ్లీ వస్తున్న బాద్‌షా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

