Jaya Bachchan: రూ.1,578 కోట్ల ఆస్తులను ప్రకటించిన జయా బచ్చన్‌.! ఐదోసారి రాజ్యసభకు నామినేషన్‌.

|

Feb 16, 2024 | 5:05 PM

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ భార్య జయా బచ్చన్‌ సమాజ్‌ వాదీ పార్టీ తరఫున ఐదోసారి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2004 నుండి సమాజ్‌ వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయా బచ్చన్‌ ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1,578 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత ఆస్తి..

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ భార్య జయా బచ్చన్‌ సమాజ్‌ వాదీ పార్టీ తరఫున ఐదోసారి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2004 నుండి సమాజ్‌ వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయా బచ్చన్‌ ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1,578 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత ఆస్తి రూ.1,63,56,190 కాగా, అదే కాలానికి తన భర్త అమితాబ్ బచ్చన్ సంపద రూ.273,74,96,590గా ఎన్నికల అఫిడవిట్‌లో జయా బచ్చన్ పొందుపరిచారు. తన బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.పది కోట్లుగా చూపించారు. తన భర్త అమితాబ్ బచ్చన్ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.120,45,62,083గా వెల్లడించారు. ఇక ఈ జంట వద్ద మొత్తం రూ.90 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. తన వద్ద రూ. 40.97 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు జయా బచ్చన్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. తన భర్త వద్ద రూ. 54.77 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. తన పేరుపై రూ. 9.82 లక్షల విలువైన వాహనాలు ఉండగా అమితాబ్ వద్ద రెండు మెర్సిడెస్, రేంజ్ రోవర్‌ సహా 16 వాహనాలు ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ మొత్తం రూ. 17.66 కోట్లుగా తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..