Puri Jagannath Temple: పూరి జగన్నాథుడి ఖజానా.. ఫిక్సైన ముహూర్తం జూలై 14.!
ఆ ఖజనాలో కళ్లు జిగేల్ మనే నగలు.. వెల కట్టలేని అపురూపమైన ఆభరణాలు.. వీటితోపాటు మరెన్నో విలువైన నగలు. ఇది ఒడిశా రాష్ట్రంలో కొలువుదీరిన జగన్నాథుడి క్షేత్రం.. పూరీలో ఉన్న రత్న భాండాగారం సంగతి. ఒకటి కాదు.. రెండు కాదు.. 46 ఏళ్లయ్యింది... ఆ గదిలోకి మనుషులు వెళ్లి. అప్పుడెప్పుడో 1978కి ముందు తెరుచుకున్న తలుపులు.. మళ్లీ ఇప్పటివరకు తెరవలేదు. కానీ నిత్యం ఇది వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కారణం.. ఈ ముఖ్యమైన భాండాగారానికి ఉన్న అసలైన తాళం చెవి మిస్సవ్వడం.
ఆ ఖజనాలో కళ్లు జిగేల్ మనే నగలు.. వెల కట్టలేని అపురూపమైన ఆభరణాలు.. వీటితోపాటు మరెన్నో విలువైన నగలు. ఇది ఒడిశా రాష్ట్రంలో కొలువుదీరిన జగన్నాథుడి క్షేత్రం.. పూరీలో ఉన్న రత్న భాండాగారం సంగతి. ఒకటి కాదు.. రెండు కాదు.. 46 ఏళ్లయ్యింది.. ఆ గదిలోకి మనుషులు వెళ్లి. అప్పుడెప్పుడో 1978కి ముందు తెరుచుకున్న తలుపులు.. మళ్లీ ఇప్పటివరకు తెరవలేదు. కానీ నిత్యం ఇది వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కారణం.. ఈ ముఖ్యమైన భాండాగారానికి ఉన్న అసలైన తాళం చెవి మిస్సవ్వడం. చూడ్డానికి, వినడానికి ఇది చిన్న అంశం కనిపించవచ్చు. కానీ ఎన్నికల్లో ప్రభుత్వాలనే మార్చేంత శక్తి దీనికి ఉందని ఈమధ్యే జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ఎన్నికల క్యాంపైన్ లో ఈ తాళం చెవి సంగతి మారుమోగింది. అలాంటి రత్నభాండాగారం తాళం చెవి ఎక్కడుంది? అసలా గదిలో ఏముంది? కేరళలో పద్మనాభస్వామి వారి ఆలయంలో ఉన్నట్టుగా అత్యంత విలువైన సంపద ఉందా? 46 ఏళ్లకు ముందు దానిని లెక్కబెట్టిన వివరాలు ఉన్నాయా?
పూరీ జగన్నాథుడికి ఉన్న ఆభరణాల సంపద గురించి తెలియాలంటే.. ముందుగా ఈ రత్న భాండాగారాన్ని తెరవాలి. అందుకే దీనిని జూలై 14న తెరవడానికి రంగం సిద్ధమైంది. తరువాత ఆ గదికి అవసరమైన మరమ్మతులు చేపడతారు. ఆ తరువాత ఆభరణాల లెక్కల వివరాలనూ పొందుపరుస్తారు. దీనిని తెరవడానికి సంబంధించి ఒడిశా సర్కార్ ఇప్పటికే బిశ్వనాథ్ రథ్ కమిటీని నియమించింది. ఈమధ్యే ఇది రెండోసారి కూడా సమావేశమైంది. ఇందులో 16 మంది సభ్యులు ఉంటారు. వీరందరి నిర్ణయం ఒక్కటే 14వ తారీఖున రత్న భాండాగారం తలుపులు తెరవాలని. దీనికి సంబంధించిన అసలు తాళం చెవి కనపడలేదు సరే. మరి డూప్లికేట్ తాళం చెవి ఏమైంది? అది ఉంది. కాకపోతే పూరీ కలెక్టరేట్ లోని ట్రెజరీలో ఉంటుంది. జగన్నాథస్వామికి ఉన్న ఆభరణాల లెక్కలు తేలాలంటే.. ఈ గది తలుపులు తెరుచుకోవాలి. అందుకే ఈ తాళం చెవి కాని పనిచేయకపోతే.. ఆ గది తలుపులు బద్దలు కొట్టడానికి కూడా కమిటీ నిర్ణయించింది.
జస్టిస్ బిశ్వనాథ్ రథ కమిటీకి చాలా పని ఉంది. ఈ గదిని తెరవడం దాని ముందున్న పెద్ద టాస్క్. అది తెరిచాక.. ఆ గది లోపలి స్వరూపం ఎలా ఉందో చూడాలి. అవసరమైన మరమ్మతులు చేయించాలి. అక్కడున్న సంపదను లెక్కించాలి. తరువాత ఆభరణాలను భద్రంగా ఉంచే చర్యలను సిఫార్స్ చేయాలి. ఈ మొత్తం పనులపై ఒక రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇదంతా ఒక క్రమపద్దతిలో జరగాలి. సో.. ఈ కమిటీకి ఇంత పని ఉంది. జగన్నాథుడికి ఉన్న సంపద తక్కువేమీ కాదు. ఆమధ్య కేరళలోని పద్మనాభస్వామివారి సంపద గురించి వెలుగుచూసిన విషయాలను ప్రపంచం చూసింది. అందుకే జగన్నాథుడి రత్నభాండాగారంలో ఎలాంటి సంపద ఉందా అన్న ఆసక్తి భక్తుల్లో పెరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.