రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడి

|

Jul 18, 2024 | 7:27 PM

భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కాల్పనికం కాదని ఇస్రో పేర్కొంది. ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ - 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు.

భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కాల్పనికం కాదని ఇస్రో పేర్కొంది. ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ – 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకూ విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??

మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు

Taapsee Pannu: అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్‌ చూసి షాక్‌ !!

ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!

Follow us on