West Nile Virus: మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే  బీ కేర్‌ఫుల్‌.!

West Nile Virus: మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్‌.!

Anil kumar poka

|

Updated on: Jul 19, 2024 | 11:38 AM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాధులు విజృంభిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు.. రోజుకో కొత్త రూపంతో మానవాళిని భయపెడుతూనే ఉంది. మరోవైపు దేశంలో బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంతలో నేనున్నానంటూ వెస్ట్ నైల్ వైరస్ కొత్త ముప్పుని మానవాళికి తీసుకొచ్చింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాధులు విజృంభిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు.. రోజుకో కొత్త రూపంతో మానవాళిని భయపెడుతూనే ఉంది. మరోవైపు దేశంలో బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఇంతలో నేనున్నానంటూ వెస్ట్ నైల్ వైరస్ కొత్త ముప్పుని మానవాళికి తీసుకొచ్చింది. ఇజ్రాయెల్‌లో ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా గత కొద్ది రోజుల్లోనే 15 మంది రోగులు మరణింనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వెస్ట్ నైల్ కొత్త వైరస్ కాదు.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వైరస్ కేసులు పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ లో వ్యాపిస్తున్న ఈ వ్యాధి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న ఈ వైరస్ కేసుల దృష్ట్యా, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. వైరస్‌ నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. వెస్ట్ నైల్ వైరస్ పక్షుల్లో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పక్షులనుంచి జంతువులకు, జంతువులనుంచి దోమల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఇజ్రాయెల్‌లో ఈ వైరస్ కేసులు అధికంగా వస్తున్నాయి. అంతేకాదు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ అవసరం. ఈ జ్వరం లక్షణాలు, నివారణ మార్గాలపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికజ్వరం, తీవ్రమైన తలనొప్పి, బలహీనంగా అనిపించడం, కీళ్లు, కండరాల్లో తీవ్రమైన నొప్పి, చర్మంపై దద్దుర్లు రావడం ఈ వ్యాధి లక్షణాలు. మనుషులు దోమకాటునుంచి రక్షించుకునేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.