Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషి 300 ఏళ్లు జీవించే కాలం రాబోతోంది..

మనిషి 300 ఏళ్లు జీవించే కాలం రాబోతోంది..

Phani CH

|

Updated on: Jan 09, 2024 | 9:49 PM

ప్రస్తుత కాలంలో మనిషి ఆయుః ప్రమాణం మహా అయితే 70 సంవత్సరాలు.. అయితే ఇటీవల విజృంభిస్తున్న వైరస్‌లు, గుండెపోట్లతో మనుషులు వయసుతో సంబంధం లేకుండా మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి 300 ఏళ్లు జీవించే రోజులు రాబోతున్నాయి అంటున్నారు ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌. అవును, విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పారు.

ప్రస్తుత కాలంలో మనిషి ఆయుః ప్రమాణం మహా అయితే 70 సంవత్సరాలు.. అయితే ఇటీవల విజృంభిస్తున్న వైరస్‌లు, గుండెపోట్లతో మనుషులు వయసుతో సంబంధం లేకుండా మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి 300 ఏళ్లు జీవించే రోజులు రాబోతున్నాయి అంటున్నారు ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌. అవును, విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పారు. పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్లు జీవించే వీలుంటుందని తెలిపారు. ఆ కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ లో శుక్రవారం జరిగిన 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ విషయాన్ని వెల్లడిచారు. ఈ సందర్భంగా ఆయన వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తుపాన్లు, భారీ వర్షాలు ఎప్పుడు? ఎక్కడ? వస్తాయన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ ఏడాది పీఎస్ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీలను కక్ష్యలోకి పంపుతున్నట్టు వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం కొనాలమ్మా… కొట్టేస్తే రాదు…

సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

4వేల డాల‌ర్లు న‌మిలేసిన‌ శున‌కం..

ఆ రోజు 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వాళ్లకు మాత్రమే

రామపాదుకలతో అయోధ్యకు పాదయాత్ర