Israel – Hamas: రఫాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్‌తో హోరాహోరీ పోరు.
దక్షిణ గాజాలోని రఫా నగరం శివార్లకే పరిమితమైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తాజాగా నగరం మధ్యకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మందుపాతర పేలి ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు బుధవారం ఐడీఎఫ్ తెలిపింది. రఫాలో పరిమిత యుద్ధం మాత్రమే చేస్తున్నామని ఐడీఎఫ్ చెబుతున్నప్పటికీ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆదివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 10 లక్షల మంది పాలస్తీనా పౌరులు రఫాను వీడారు. వీరంతా నిరాశ్రయులై ఉత్తర, మధ్య గాజా నుంచి రఫాకు తరలి వచ్చిన వారే. అక్టోబరులో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు 36 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అంతర్జాతీయంగానూ ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెరుగుతోంది. టెల్ అవీవ్‌లోని తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం బ్రెజిల్ ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ముందు నుంచీ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వా విమర్శిస్తూ ఉన్నారు. పాలస్తీనా ప్రజలపై నెతన్యాహు ప్రభుత్వం దాష్టీకం చేస్తోందని ఇటీవల ఆయన పేర్కొన్నారు. దీంతో టెల్ అవీవ్‌లోని బ్రెజిల్ రాయబారిని ఇజ్రాయెల్ ఇటీవల మందలించింది. ఈ నేపథ్యంలోనే రాయబారి ఫ్రెడరికో మేయర్‌ను స్వదేశానికి లూలా రప్పించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.