Viral Video: నువ్వు సూపర్ మావ..స్పూన్స్ తో గిన్నీస్ రికార్డ్.. వీడియో చేస్తే వావ్ అనాల్సిందే..
Viral Video: నలుగురు చేసే పనిని మనం కూడా చేస్తే అందులో గొప్ప ఏంటి చెప్పండి.? అందుకే కొత్తగా ఆలోచించే వారినే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. అలా గుర్తించిన వారికి ఇచ్చేదే గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఏదైనా కొత్తది, అనూహ్యమైందని సాధించిన...
Viral Video: నలుగురు చేసే పనిని మనం కూడా చేస్తే అందులో గొప్ప ఏంటి చెప్పండి.? అందుకే కొత్తగా ఆలోచించే వారినే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. అలా గుర్తించిన వారికి ఇచ్చేదే గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness world). ఏదైనా కొత్తది, అనూహ్యమైందని సాధించిన వారికి గిన్నిస్ బుక్‌లో స్థానం కల్పిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో అసమాన ప్రతిభతో ఈ అరుదైన గుర్తింపును సంపాదించుంటారు. తాజాగా ఇలాంటి ఓ అరదైన ఘనతను దక్కించుకున్నాడు ఇరాన్‌కు చెందిన 50 ఏళ్ల సాబెర్ అనే వ్యక్తి.
ఇరాన్‌కు చెందిన ఇతను శరీరంపై ఏకంగా 85 స్పూన్స్‌ను బ్యాలెన్స్ చేసి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు. గతంలో స్పెయిన్‌కు చెందిన వ్యక్తి సాధించిన 64 స్పూన్ల రికార్డును బద్దలు కొట్టి మరీ ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. శరీరంపై ఉంచిన స్కూన్స్‌ను ఎంతో ఏకాగ్రతగా బ్యాలెన్స్ చేస్తూ కొద్ది క్షణాల పాటు పడకుండా చేయడంతో ఈ రికార్డు దక్కింది. ప్రస్తుతం ఈ గిన్నిస్ రికార్డుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గిన్నిస్ రికార్డ్స్ వరల్డ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ వైరల్ వీడియోను మీరూ ఓసారి చూసేయండి..
View this post on Instagram
Also Read: Nellore District: గతంలో భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీసిన పెంచలయ్య ఆత్మహత్యాయత్నం
Allu Arjun: పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా.. పది రోజుల్లోనే రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్..
Coronavirus: జ్వరంతో బాధపడుతున్నారా.? కరోనా అని భయమా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..