Feeling Tired: ఎప్పుడూ అలిసిపోయినట్టుగా అనిపిస్తోందా.? కారణం ఇదే.!

కొందరు ఆహారం బాగానే తీసుకున్నా, మిగతా అన్నీ బాగానే ఉన్నా.. చాలా డల్ గా ఉంటారు. ఎప్పుడూ అలిసిపోయినట్టుగా కనిపిస్తుంటారు. దానికి కారణం పెద్ద పెద్ద వ్యాధులు, అనారోగ్య సమస్యలేమీ కాకపోవచ్చు. మన నిత్య జీవన శైలిలోని కొన్ని అలవాట్లే దీనికి కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చూడటానికి అవి చాలా సింపుల్ గానే కనిపించినా.. వాటి ప్రభావం ఎక్కువగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Feeling Tired: ఎప్పుడూ అలిసిపోయినట్టుగా అనిపిస్తోందా.? కారణం ఇదే.!

|

Updated on: May 26, 2024 | 6:43 PM

కొందరు ఆహారం బాగానే తీసుకున్నా, మిగతా అన్నీ బాగానే ఉన్నా.. చాలా డల్ గా ఉంటారు. ఎప్పుడూ అలిసిపోయినట్టుగా కనిపిస్తుంటారు. దానికి కారణం పెద్ద పెద్ద వ్యాధులు, అనారోగ్య సమస్యలేమీ కాకపోవచ్చు. మన నిత్య జీవన శైలిలోని కొన్ని అలవాట్లే దీనికి కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చూడటానికి అవి చాలా సింపుల్ గానే కనిపించినా.. వాటి ప్రభావం ఎక్కువగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాటిని మార్చుకుంటే.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండవచ్చని చెప్తున్నారు. అవేమిటో చూద్దాం.. మీ అలసటకు మొట్టమొదటి కారణం డీహైడ్రేషన్..ఇది చూడటానికి చిన్నగానే కనిపిస్తుంది. కానీ సమయానికి నీళ్లుతాగకపోతే.. శరీరంలో తగిన స్థాయిలో నీళ్లు లేకపోతే.. విపరీతంగా నిస్సత్తువ ఆవహిస్తుంది. దాహంగా అనిపించినప్పుడు తాగుతాం కదా అని అనుకోవద్దని.. డీహైడ్రేషన్ అప్పటికే మొదలై, మనం డల్ గా అవడం మొదలైన తర్వాత దాహంగా అనిపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

తీవ్ర అలసటకు మరో కారణం నోరుతెరుచుకుని నిద్రపోవడం.. కొందరు రాత్రిపూట నోరు తెరుచుకుని నిద్ర పోతుంటారు. ఇది శరీరం డీహైడ్రేషన్‌కి దారి తీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు ఇది మీలో శ్వాస సంబంధిత సమస్యలకు సంకేతమని వివరిస్తున్నారు. ఇది శరీరానికి తగిన విశ్రాంతి లేకుండా చేసి.. అలసటను పెంచుతుందని అంటున్నారు. దీని నివారణ కోసం శ్వాసకు సంబంధించిన ఎక్సర్ సైజులు చేస్తే మంచిదిన సూచించారు. మన శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. శరీరం నిస్సత్తువగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. పైకి బాగానే కనబడినా, ఇతర ఆరోగ్య సమస్యలేవీ పెద్దగా లేకున్నా.. అలసటగా అనిపిస్తుంటే ఐరన్ లోపం అయి ఉంటుందని వివరిస్తున్నారు. తగిన ఆహారం తీసుకుంటే.. ఐరన్ శరీరానికి అంది శక్తిమంతం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక అతిగా కాఫీలు, టీలు తాగే అలవాటు..కూడా నిస్సత్తువకు కారణం అంటున్నారు. ఈ కాఫీ,టీలు కాసేపు శరీరాన్ని ఉత్సాహంగా ఉంచినా తర్వాత ప్రయోజనం ఉండదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా నిద్రకు ఐదారు గంటల ముందు నుంచీ.. అంటే సాయంత్రం నాలుగు, ఐదు గంటల తర్వాతి నుంచి కాఫీ, టీలు, కెఫీన్ కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. అవి శరీరం పూర్తి విశ్రాంతి తీసుకోకుండా చేసి.. అలసటను పెంచుతాయని అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
ఐదు తరాల ఆత్మీయ కలయిక.. సెంచరీ కొట్టిన బామ్మకు సర్‌ప్రైజ్‌ పార్టీ
ఐదు తరాల ఆత్మీయ కలయిక.. సెంచరీ కొట్టిన బామ్మకు సర్‌ప్రైజ్‌ పార్టీ
ఈ ప్రదేశాలు సందర్శనకు మాత్రమే కాదు..యోగాకు కూడా బెస్ట్
ఈ ప్రదేశాలు సందర్శనకు మాత్రమే కాదు..యోగాకు కూడా బెస్ట్
జమ్మూ కశ్మీర్‎లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. వేలాది కోట్లతో..
జమ్మూ కశ్మీర్‎లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. వేలాది కోట్లతో..
టాస్ గెలిచిన అమెరికా.. సౌతాఫ్రికా ప్లేయింగ్ 11లో కీలక మార్పు
టాస్ గెలిచిన అమెరికా.. సౌతాఫ్రికా ప్లేయింగ్ 11లో కీలక మార్పు
ఒక రోజులో ఎన్ని కప్పుల పాలు తాగాలి..? అతిగా తాగితే ఏమవుతుందంటే..
ఒక రోజులో ఎన్ని కప్పుల పాలు తాగాలి..? అతిగా తాగితే ఏమవుతుందంటే..
పెళ్లింట విషాదం.. మెహంది ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ వధువు మృతి..
పెళ్లింట విషాదం.. మెహంది ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ వధువు మృతి..
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్..
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య
రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. సందర్శించే ప్రాంతాలివే
రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. సందర్శించే ప్రాంతాలివే
వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి బారిన పడితే డేంజర్ లక్షణాలు ఏమిటంటే
వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి బారిన పడితే డేంజర్ లక్షణాలు ఏమిటంటే
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
'నా వల్ల చెడ్డ పేరు వస్తుందంటే టీడీపీకి గుడ్ బై చెప్తా'.. జేసీ
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో