Instagram: ప్రాణం తీసిన ఇన్‌స్టా పరిచయం.! అది అడగ్గా ఎమోషనల్ బ్లాక్ మెయిల్.
మృతురాలి తమ్ముడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్టాలో పరిచయం అయిన వ్యక్తి విశాఖపట్నం చెందినవాడిగా గుర్తించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు. నిందితుడు గతంలో ఇంకా ఎవరినైనా మోసం చేశాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్టాలో.. మహిళలను పరిచయం చేసుకుని.. ఈ విధంగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారని.. మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో పిచ్చి పరిచయాలు.. ఆపై పిచ్చి స్నేహాలు ప్రాణాలు మీదకు తెస్తున్నాయి. తాజాగా ఏపీలో వివాహిత ఇన్‌స్టాలో పరిచయమైన ఓ వ్యక్తి కారణంగా ప్రాణాలు తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆపై వారిద్దరూ మధ్య చాలా చాటింగ్ నడిచింది. ఈ సమయంలో వివాహితను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశాడు సదరు వ్యక్తి. దీంతో ఆమె తన వద్ద ఉన్న విలువైన బంగారు నగలు, నాలుగు లక్షల నగదు ఇచ్చింది. ఆపై బంగారు ఆభరణాలు విషయమై ఇంట్లో వాళ్లు ప్రశ్నించడంతో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ వివాహిత పుట్టింటికి వచ్చి ఉరేసుకుని తనువు చాలించింది. మృతురాలికి ఒక పాప ఉన్నట్లు తెలిసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

