Viral Video: ఇదేం పిచ్చి బాబు.. ఒంటినిండా కీటకాలే…! గిన్నిస్‌ రికార్డ్‌ కోసం టాటూలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

|

Feb 16, 2022 | 6:40 PM

ఒకప్పుడు శరీరంపై చిన్నగా, సింపుల్ గా పచ్చబొట్టు వేయించుకోవాలంటేనే భయపడిపోయేవారు కానీ ప్రస్తుత కాలంలో శరీరంపై పెద్ద పెద్ద టాటూలు వేసుకుని తిరుగుతున్నారు జనం. అంతేకాదు ఓ వ్యక్తి ఏకంగా టాటూలు వేయించుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కాడు. ఈ వ్యక్తి పేరు మైఖేల్ అమోయా.


ఒకప్పుడు శరీరంపై చిన్నగా, సింపుల్ గా పచ్చబొట్టు వేయించుకోవాలంటేనే భయపడిపోయేవారు కానీ ప్రస్తుత కాలంలో శరీరంపై పెద్ద పెద్ద టాటూలు వేసుకుని తిరుగుతున్నారు జనం. అంతేకాదు ఓ వ్యక్తి ఏకంగా టాటూలు వేయించుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కాడు. ఈ వ్యక్తి పేరు మైఖేల్ అమోయా. ఇతను అమెరికాలోని న్యూయార్క్ నివాసి. ఇతను తన శరీరంపై 864 క్రిమికీటకాల టాటూలు వేయించుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాడు.ఇంకో ఇంట్రెస్టింగ్‌ విషయమేంటంటే మైఖేల్‌కు క్రిమి కీటకాలంటే అసహ్యమట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మైఖేల్ కంటే ముందు శరీరంపై ఎక్కువ కీటకాల టాటూలు వేయించుకున్న వ్యక్తి బాక్‌స్టర్ మిల్సోమ్. అతని శరీరంపై మొత్తం 402 కీటకాల పచ్చబొట్లు ఉండేవి. మైఖేల్ తన 21 సంవత్సరాల వయస్సులో శరీరంపై పచ్చబొట్లు వేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా తన చేతిపై ఎర్ర చీమల పచ్చబొట్టు వేయించుకున్నాడు. తరువాత అతను టాటూలతో ఎంతగానో ప్రేమలో పడ్డాడు. మొత్తం శరీరాన్ని టాటూలతో కప్పేసుకున్నాడు. మొత్తానికి టాటూలతో గిన్నిస్‌ రికార్డ్‌ సాధించాడు.

మరిన్ని చూడండి ఇక్కడ: