Anand Mahindra Tweet: పాక్‌ ఆటగాడికి భారత స్టార్‌ హీరో ప్రశంస..! ముచ్చటపడిన ఆనంద్ మహీంద్రా.. నెటిజన్ల ప్రశంసలు కూడా..

Anand Mahindra Tweet: పాక్‌ ఆటగాడికి భారత స్టార్‌ హీరో ప్రశంస..! ముచ్చటపడిన ఆనంద్ మహీంద్రా.. నెటిజన్ల ప్రశంసలు కూడా..

Anil kumar poka

|

Updated on: Aug 18, 2022 | 7:48 AM

కామన్వెల్త్ క్రీడల్లో జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కు స్వర్ణం అందించాడు అర్షద్‌ నదీమ్. ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 90.18 మీటర్లు విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు. నదీమ్‌ ప్రదర్శనతో పాక్‌ 56 ఏళ్ల తర్వాత..


కామన్వెల్త్ క్రీడల్లో జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కు స్వర్ణం అందించాడు అర్షద్‌ నదీమ్. ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 90.18 మీటర్లు విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు. నదీమ్‌ ప్రదర్శనతో పాక్‌ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌ గేమ్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకం గెలవగా.. జావెలిన్ త్రోలో పాక్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. దీనిపై భారత స్టార్‌ ఆటగాడు నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘అర్షద్ భాయ్ స్వర్ణం సాధించినందుకు అభినందనలు. 90 మీటర్ల త్రో దాటి కొత్త రికార్డు నమోదుచేశావు. భవిష్యత్‌లో మరిన్ని పోటీల్లో గెలవాలి. ఆల్ ది బెస్ట్’ అని అభినందించారు. దాయాది దేశానికి చెందిన వ్యక్తి, తనకు పోటీదారుగా ఉన్న అర్షద్‌ను నీరజ్ అభినందించడం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాను ముచ్చటగొల్పింది. వారి అనుబంధం ఆయన్ను ఆకర్షించింది. ‘ప్రపంచం ఇలా ఉండాలి. పోటీతత్వం, శత్రుత్వం మధ్య తేడాని స్పష్టంగా ప్రదర్శించినందుకు వారికి బంగారు పతకం ఇవ్వాలి’ అని మహీంద్రా స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 18, 2022 07:48 AM