ఇండియన్ నేవీ 23 మంది పాకిస్థానీలను ఎందుకు రక్షించింది ??

|

Apr 01, 2024 | 9:05 PM

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడి నుంచి 23 మంది పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. మార్చి 28న ఇరాన్‌కు చెందిన ఓ చేపల బోటుపై సముద్రపు దొంగలు దాడి చేశారని తెలియడంతో రంగంలోకి దిగిన భారత నేవీ 12 గంటల పాటు శ్రమించి దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దాడి గురించి తెలియగానే రెండు యుద్ధ నౌకలను అక్కడికి పంపించినట్లు నేవీ తెలిపింది.

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడి నుంచి 23 మంది పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. మార్చి 28న ఇరాన్‌కు చెందిన ఓ చేపల బోటుపై సముద్రపు దొంగలు దాడి చేశారని తెలియడంతో రంగంలోకి దిగిన భారత నేవీ 12 గంటల పాటు శ్రమించి దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దాడి గురించి తెలియగానే రెండు యుద్ధ నౌకలను అక్కడికి పంపించినట్లు నేవీ తెలిపింది. 12 గంటల పాటు శ్రమించి నావపై ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పింది. పడవలోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని రక్షించినట్టు వెల్లడించింది. అనంతరం, నావను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టినట్లు పేర్కొంది. సోకోట్రా తీరానికి నైరుతి దిక్కున 90 నాటికల్ మైళ్ల దూరంలో దొంగలు ఆ నావపై దాడి చేశారు. తమను రక్షించాలంటూ సిబ్బంది అభ్యర్థించగానే భారత నేవీ రంగంలోకి దిగింది. తొలుత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమేధ.. దొంగలు హైజాక్ చేసిన నావను అడ్డగించింది. ఆ తరువాత.. సుమేధకు తోడుగా ఐఎన్ఎస్ త్రిశూల్‌ కూడా రంగంలోకి దిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాంగ్ స్టర్‌ ఇంటర్వ్యూ అని వెళ్లి కిడ్నాపైన యూట్యూబర్

12 నెలల్లో రూ.7.3 లక్షలకు ఇడ్లీలు ఆర్డర్ .. హైదరాబాద్ వ్యక్తి రికార్డు

Follow us on