అండర్‌ గ్రౌండ్‌లో గ్రహాంతరవాసి ఆలయం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

Aug 05, 2024 | 9:26 PM

సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాలకు గుడి కట్టి ఆరాధిస్తుంటారు. ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు కూడా వారిని మరువలేక వారి విగ్రహాలను తయారు చేయించి ఇంటి ఆవరణలో ప్రతిష్టించుకుంటున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఏలియన్‌కి గుడి కట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాలకు గుడి కట్టి ఆరాధిస్తుంటారు. ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు కూడా వారిని మరువలేక వారి విగ్రహాలను తయారు చేయించి ఇంటి ఆవరణలో ప్రతిష్టించుకుంటున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఏలియన్‌కి గుడి కట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తమిళనాడులోని లోగనాథన్ సేలం జిల్లా మల్లమూపంబట్టి కి చెందిన రామకౌండనూర్ అనే వ్యక్తి స్థానికంగా టీ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శివుడి మీద ఉన్న అపార భక్తితో ఆయన తన తోటలో శ్రీ శివ కైలాయ దేవాలయం పేరుతో ఆలయాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. రెండేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి మొదటగా రాహ రూపంలో విష్ణు మూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలుపెట్టాడు . దీనికి సమీపంలోనే కింది అంతస్తులో శివలింగాన్ని ఏర్పాటు చేసాడు. ఇందులోభాగంగా అండర్ గ్రౌండ్ ఉన్న స్థలం లో ధ్యానం కోసం ప్రత్యేక మెడిటేషన్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ధ్యాన మందిరంలో ఆకాశంలో ఎగురుతున్న అగతియార్ లాంటి విగ్రహాన్ని, గ్రహాంతరవాసి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రోజు విష్ణు మూర్తి , శివలింగాలకి ప్రత్యేక పూజలు చేసినట్టు గ్రహాంతరవాసి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ చుట్టుపక్కల గ్రామాలలో ఆలయం గురించి ప్రచారం చేస్తూవచ్చాడు .

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: వయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల విరాళం

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా ?? ఇలా చేసి చూడండి !!

ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు బంద్‌.. పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

ఫాస్టగ్ కొత్త రూల్స్.. ఇంతకీ .. కేవైసీ అప్‌డేట్ చేశారా ??

Ismart News: కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు

Follow us on