Manchiryal: హరీష్ రావు సార్.. ఇటు కాస్త చూడండి సర్..!

Manchiryal: హరీష్ రావు సార్.. ఇటు కాస్త చూడండి సర్..!

Anil kumar poka

|

Updated on: Sep 08, 2023 | 8:18 PM

ప్రభుత్వాసుపత్రుల్లో సకల వసతులు కల్పిస్తున్నామని సర్కార్ చెబుతున్నా.. ఇక్కడ ఆస్పత్రిలో చేరాలంటే ఫ్యాన్ తెచ్చుకోమని చెబుతున్నారు వైద్య సిబ్బంది. కనీసం మంచం కూడా లేదు.. వరండానే వారికి పానువుతోంది. మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయి. జిల్లాలో జ్వరం పీడితులు, ఇతర వ్యాధులకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ కోసం వారం రోజులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రభుత్వాసుపత్రుల్లో సకల వసతులు కల్పిస్తున్నామని సర్కార్ చెబుతున్నా.. ఇక్కడ ఆస్పత్రిలో చేరాలంటే ఫ్యాన్ తెచ్చుకోమని చెబుతున్నారు వైద్య సిబ్బంది. కనీసం మంచం కూడా లేదు.. వరండానే వారికి పానువుతోంది. మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయి. జిల్లాలో జ్వరం పీడితులు, ఇతర వ్యాధులకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ కోసం వారం రోజులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా సరిపోని‌ బెడ్లు, పని చేయని ఫ్యాన్లతో ప్రసవ వేదన అనుభవిస్తున్న గర్బిణీలు, బాలింతలు పడరాని పాట్లు పడుతున్నారు‌. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్య సేవలందిస్తున్నాం.. ఇవీ నాయకులు ఇచ్చే ప్రసంగాలు.. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇక గర్భిణులకు చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక కొందరు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి గత నెలలో వరద ముప్పు రావడంతో.. అక్కడి నుంచి వారిని మంచిర్యాల జనరల్ హాస్పిటల్‌కు ప్రసవం కోసం గర్బిణీలను తరలించారు.

జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నుంచి ప్రసూతి కోసం మంచిర్యాల జనరల్ హాస్పిటల్‌కు వస్తున్నారు. దాదాపు రోజుకు 20 నుంచి 30 వరకు డెలివరీలు అయ్యే ఈ హాస్పిటల్ ఒకవైపు జనరల్, మరో వైపు గర్భిణులతో నిండిపోతుంది. ఉండేందుకు వారికి వసతులు లేకుండాపోయాయి. వార్డులలో బెడ్స్ ఉన్న వాటి పైకి బెడ్ షీట్స్ వేయడం లేదు. కనీసం మంచాలు సరిపోకపోవడంతో ఆరుబయటే వరండాలో గర్బిణీలను బాలింతలు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని గదుల్లో బాత్రూంలో నీళ్లు రాకపోవడంతో గంటల తరబడి నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. రాత్రి దోమల బెడద, ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడంలో జాగారం చేయాల్సి వస్తుందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి కోసం బయట నుంచి 1200 రూపాయలతో టేబుల్ ఫ్యాన్‌లు కొనుక్కుని తెచ్చుకుంటున్నారు . మండలాల వారీగా పీహెచ్‌సీలు ఉన్నపటికీ అక్కడ సరిగా బెడ్స్, సౌకర్యాలు లేవని చాల వరకు కేసులు మండల కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రికి రెఫెర్ చేస్తున్నారు. తీరా ఇక్కడికి వస్తే అదే పరిస్థితి ఎదురవుతుంది. బెడ్స్ లేక వార్డులలో మంచాలను వేసి ఫ్లూయిడ్స్ పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక చిన్న పిల్లల వార్డులలో బెడ్స్ సరిపోక ఒకే బెడ్‌పై ఇద్దరు పిల్లలను ఉంచి చికిత్స చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..