ఇలాంటి అద్భుతాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు..! వీడియో
తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా దట్టమైన పొగమంచు అలముకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి ఆందాలకు కొదవే లేదు. కొండలు, కోనలు పచ్చని చెట్లతో ఆకట్టుకుంటాయి. ఇక చలికాలంలో మంచుతో నిండిన కొండలు హిమగిరులను తలపిస్తాయి. ఇక చెట్లు, ఆకులు అన్నీ తెల్లని మంచుతో కొత్త అందాలను సంతరించుకుంటాయి. వాటిపై లేలేత సూర్యకిరణాలు పడగానే వెండికొండలా మెరుస్తూ ఆకట్టుకుంటాయి. తాజాగా ఖమ్మం జిల్లా ఏజెన్సీలో మంచు కారణంగా ఏర్పడిన ఓ అద్భుత దృశ్యం ఆకట్టుకుంటోంది. ప్రకృతి ప్రేమికులు ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి.
చెట్లు చేమలు మంచుదుప్పటి కప్పుకున్నాయి. ఈ క్రమంలో చెట్ల కొమ్మలకు సాలెపురుగులు అల్లుకున్న గూళ్లు ఆకట్టుకుంటున్నాయి. ఆ సాలెగూళ్ళు కూడా మంచుతో అల్లినట్టుగా విచిత్రంగా కనిపిస్తున్నాయి. ముత్యాలతో దండగుచ్చినట్టుగా సాలెగూడు మంచుబిందువులతో మెరుస్తూ కనిపిస్తోంది. మరోవైపు మెల్లగావీస్తున్న చలిగాలికి ఆ సాలెగూళ్లు రెపరెపలాడుతూ ఊగుతున్నాయి. అయినా అవి చెక్కు చెదరడంలేదు. ఈ ప్రకృతి అందాలను చూసి పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చెట్ల ఆకులు, పువ్వులు అన్నీ మంచుతో నిండిపోయాయి. కొత్త అందాలను సంతరించుకుని ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. భద్రగిరిపై దట్టమైన పొగమంచు కమ్మేయడంతో హిమాలయాలను తలపిస్తోంది. పొగమంచును చీల్చుకొని భూమిని తాకుతున్న లేలేత సూర్య కిరణాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. మరోవైపు పొగమంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హెడ్ లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
