Tax System: దేశంలో కొత్త పన్ను విధానం అమలు.. కీలక మార్పులు ఇవే!
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో కేంద్రం గతంలో ప్రకటించిన కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానం ప్రారంభించింది. ప్రభుత్వం ఈ విధానాన్ని డీఫాల్ట్‌గా అమలు చేయనుండటంతో పాత విధానంలో పన్ను చెల్లించాలనుకున్న వారు ఈ విషయాన్ని ముందస్తుగా తమ దరఖాస్తుల్లో ప్రకటించాలి.
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో కేంద్రం గతంలో ప్రకటించిన కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, పన్ను భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానం ప్రారంభించింది. ప్రభుత్వం ఈ విధానాన్ని డీఫాల్ట్‌గా అమలు చేయనుండటంతో పాత విధానంలో పన్ను చెల్లించాలనుకున్న వారు ఈ విషయాన్ని ముందస్తుగా తమ దరఖాస్తుల్లో ప్రకటించాలి. లేని పక్షంలో కొత్త విధానంలో పన్ను మదింపు జరుగుతుంది. పాత పన్ను విధానం మరియు కొత్త పన్ను విధానం మధ్య మీరు ఎంచుకోకపోతే, ఏప్రిల్ 1 నుండి మీరు డీఫాల్ట్‌గా కొత్త పన్ను విధానంలోకి మార్చబడతారు. కొత్త పన్ను విధానంలో, రూ.7 లక్షల వరకు ఆదాయంపై మీరు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేయాలనుకుంటే, పాత పన్ను విధానం మీకు మెరుగ్గా ఉండవచ్చు. ఇంతకు ముందు, రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో మాత్రమే వర్తించేది. ఇప్పుడు అది కొత్త పన్ను విధానంలోనూ చేర్చారు. స్టాండర్డ్ డిడక్షన్ కింద, రూ.50 వేలకు పన్ను మినహాయింపు లభిస్తుంది, అంటే స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత, మీరు రూ.7.5 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక రూ.5 కోట్లకు మించి ఆదాయం ఉన్న వారికి విధించే సర్ చార్జ్‌ను 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. అయితే, కొత్త విధానం ఎంచుకున్న వారికే ఈ అవకాశం ఉంది. మరోవైపు, గతేడాది ఏప్రిల్ 1 తరువాత అందిన ఇన్సూరెన్స్ నిధులు రూ. 5 లక్షల పరిమితి దాటితే పన్ను విధిస్తారు. ప్రభుత్వేతర ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్లపై పన్ను మినహాయింపు పరిమితి పాత విధానంలో రూ. 3 లక్షలు కాగా ప్రస్తుతం దాన్ని రూ. 25 లక్షలకు పెంచారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.