Illegal Turtles: పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

Updated on: May 19, 2024 | 2:50 PM

పోలీసులు, అధికారులు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటంలేదు. గంజాయి, మద్యం, బంగారం ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అక్రమ రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా ఉల్లిబస్తాల మాటున తాబేళ్లను తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఏకంగా 1600 వందల తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు, అధికారులు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటంలేదు. గంజాయి, మద్యం, బంగారం ప్రతిరోజూ ఎక్కడో అక్కడ అక్రమ రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా ఉల్లిబస్తాల మాటున తాబేళ్లను తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఏకంగా 1600 వందల తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్‌ పేట ఫారెస్ట్‌ చెక్‌ పోస్టు వద్ద ఫారెస్ట్‌ అధికారులు తనిఖీలు చేస్తుండగా భారీగా తాబేళ్లు పట్టబడ్డాయి. పుష్ప సినిమా రేంజ్‌లో తాబేళ్ల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు అక్రమార్కులు . కాకినాడ జిల్లా రామచంద్రాపురం నుంచి ఒడిస్సాకు ఓ వ్యాన్‌లో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. బూరుగుపూడి, గోకవరం చెక్‌పోస్ట్‌ వద్ద తనఖీల్లో తప్పించుకున్న కేటుగాళ్లు ఫోక్స్‌ పేట వద్ద దొరికిపోయారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 3 లక్షల విలువ చేసే 1600 వందల తాబేళ్లను, ఓ వాహనం, పైలెట్ కార్‌ స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఫోక్స్‌పేట అటవీరేంజ్‌ అధికారి కరుణాకర్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.