Liquor Lady: అసలు రహస్యం దేవుడి కిందే.. దర్జాగా దందా..! దేవాలయాన్నే మద్యం దుకాణంగా మార్చేసిన మహిళ.

Updated on: Dec 20, 2022 | 9:34 AM

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో అక్రమ లిక్కర్‌ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. లిక్కర్‌ బ్యాన్‌ ఉన్న ఈ ప్రాంతంలో మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసు దాడులు జరుగుతున్నాయి. అయితే


మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో అక్రమ లిక్కర్‌ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. లిక్కర్‌ బ్యాన్‌ ఉన్న ఈ ప్రాంతంలో మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసు దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది ఓ మహిళ. ఏకంగా దేవాలయాన్నే మద్యం దుకాణంగా మార్చేసింది ఈ లిక్కర్‌ మాఫియా గ్యాంగ్‌లోని మహిళ. ఎక్కడైనా అయితే ఎక్సైజ్‌ పోలీసులు ఇట్టేపట్టేస్తారని భావించిన సదరు మహిళ గుళ్ళో దేవుడి విగ్రహాల కింద మద్యంబాటిళ్ల బాక్సులు దాచేసి, యథేచ్ఛగా అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తోంది. పోలీసులు పలుసార్లు దాడులు చేసినా, అక్కడేమీ దొరకలేదు. అయితే అసలు రహస్యం దేవుడి కిందే దాచారన్న విషయం తాజాగా తేలింది. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

 

Published on: Dec 20, 2022 09:34 AM