మీ ఊరిలో కరెంటు పోతే.. వెంటనే ఈ నెంబర్‌కు కాల్‌ చేయిండి

Updated on: Jan 31, 2025 | 4:16 PM

అసలే వచ్చేది వేసవి కాలం. కరెంటు కోతల కాలం. కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో కరెంటు కోతల కంప్లైట్స్ కు ఎస్పీడీసీఎల్‌ కార్యాచరణ సిద్దం చేసింది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే టోల్‌ఫ్రీ నెంబరును సంప్రదిస్తారు. ఇది ఇన్నాళ్లూ గ్రేటర్‌ హైదరాబాద్‌కే పరిమితం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది.

విద్యుత్‌ కంప్లైంట్స్‌ నెంబర్‌ 1912 సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ దక్షిణ డిస్కమ్‌ ఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇకపై గ్రామాల్లో కరెంట్‌ పోతే నేరుగా 1912 నెంబరుకు ఫోన్‌ చేయవచ్చు. సరఫరాలో అంతరాయం కలిగినా, ఏదైనా విద్యుత్‌ అత్యవసర పరిస్థితి తలెత్తినా టోల్‌ఫ్రీ నెంబరును సంప్రదించాలని దక్షిణ డిస్కమ్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఒక ప్రకటనలో సూచించారు. వచ్చే వేసవి కాలంలో పెరిగే విద్యుత్‌ డిమాండుకు తగ్గట్టుగా వేసవి కాల ప్రణాళిక కోసం కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకోసం వివిధ జిల్లాల పరిధిలో విద్యుత్‌ సరఫరా తీరుతెన్నులను పరిశీలించేందుకు గాను పలువురు అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. అయితే కరెంటు కోతలపై నోడల్‌ అధికారులనే నియమించారంటే ఈసారి కరెంటు కోతలు భారీగానే ఉండనున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి ఇళ్ల ప్రాంగణంలో తచ్చాడిన వింత జంతువు.. అదేమిటి అని ఆరా తీయగా

రూ.2,500 కోట్ల ఆస్తికి వారసుడు.. కానీ పాపం

ఉదయాన్నే బ్లాక్‌ కాఫీ తాగితే ఇన్ని ప్రయోజనాలా

చియా సీడ్స్‌ తీసుకుంటున్నారా.. జాగ్రత్త.. ఇలా చేశారంటే

దక్షిణాదికి అత్యున్నత గౌరవం.. సౌత్‌ దశ తిరిగిందా

Published on: Jan 31, 2025 04:15 PM