Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాహంతో అల్లాడిన కోతి.. పాపం ఇలా..!

దాహంతో అల్లాడిన కోతి.. పాపం ఇలా..!

Samatha J

|

Updated on: Jan 31, 2025 | 2:20 PM

ఎండాకాలం సమీపిస్తోంది.. ఇక నీటి కష్టాలు మొదలవుతాయి. మనుషుల విషయం పక్కన పెడితే.. పశుపక్ష్యాదులకు నీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడతాయి. అందుకే ఇంటి డాబాలపైన, ఇళ్ల ఆవరణలో పక్షులు, ఇతర మూగజీవులకు నీరు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు కొందరు. తాజాగా నీటికోసం అల్లాడిపోయిన ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకారం.. కొందరు స్కూల్‌ విద్యార్థులు ఒక బస్టాప్‌ వద్ద బస్సు కోసం నిల్చొని ఉన్నారు.

ఇంతలో బాగా దాహంతో ఉన్న ఒక కోతి అక్కడకు వచ్చింది. ఒక విద్యార్థి స్కూల్‌ బ్యాగ్‌లో ఉన్న వాటర్‌ బాటిల్‌ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ బాలుడి తల్లి దీనిని గమనించి వెంటనే స్పందించింది. కుమారుడి భద్రతతోపాటు ఆ కోతి అవసరాన్ని ఆమె గ్రహించింది. వెంటనే ఆ వాటర్ బాటిల్‌ మూత తీసి కోతికి నీటిని తాగించింది. విపరీతమైన దాహంతో అల్లాడిన ఆ కోతి.. మహిళ నీళ్లు పట్టించగానే ఎంతో ఆర్తితో గటగటా తాగేసింది. తన దాహం తీరగానే హమ్మయ్య అనుకుంటూ ఎంతో హ్యాపీగా అక్కడినుంచి వెళ్లిపోయింది. పక్కనే ఉన్న ఓ స్తంభం దగ్గర ఆగి ఆ విద్యార్ధులతో పాటు మహిళ వైపు కృతజ్ఞతగా చూసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. కోతి దాహం తీర్చిన విద్యార్థి తల్లిని మెచ్చుకున్నారు. ఎంతైనా తల్లి తల్లేనని కొందరు కొనియాడారు. ఎవరి అవసరాలు ఏమిటో అన్నది మాతృమూర్తులు గ్రహించి వాటిని తీరుస్తారని మరికొందరు ప్రశంసించారు.