Girl – Mother: సారీ.. అమ్మా.. కట్టిపడేస్తున్న ఆరేళ్ల చిన్నారి లెటర్ వైరల్..

Updated on: Mar 01, 2023 | 9:33 PM

తల్లిబిడ్డల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం ఉండదు. ప్రతి తల్లికీ తన బిడ్డలు ఎంత పెద్దవారైనా తన కంటిని

తల్లిబిడ్డల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం ఉండదు. ప్రతి తల్లికీ తన బిడ్డలు ఎంత పెద్దవారైనా తన కంటిని చిన్నారి పాపలాగే కనిపిస్తారు. తాజాగా ఓ చిన్నారి బాలిక తన తల్లి పడుతున్న కష్టం చూసి కరిగిపోయింది. తన బాధను ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియని వయసు ఆ చిన్నారిది. ఆరేళ్ల బాలిక తన తల్లిపై తనకున్న గాఢమైన ప్రేమను తెలియజేస్తూ రాసిన లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్‌ చదివిన తర్వాత మీ రోజు మారిపోతుంది. మీరు పట్టరాని సంతోషంతో నిండిపోతారు. ఎందుకంటే ఒకే ఒక్క లైన్‌తో ఉన్న ఆ లేఖ అందరినీ కట్టిపడేస్తుంది. ‘ప్రియమైన అమ్మ.. సారీమా.. ఈ రోజు నీవు చాలా కష్టపడుతున్నావు…!’ అంటూ ఆ లేఖలో రాసింది.ఈ ఒక్క లైన్‌లో ఆమెకు తన తల్లి పట్ల ప్రేమ, శ్రద్ధ ఎంత ఉందో అర్థం అవుతుంది. తన తల్లి కష్టాలను, బాధలను అర్థం చేసుకుని తల్లికి అండగా నిలుస్తానని కూడా ఆ చిన్నారి మాటలకు అర్థం. ఆరేళ్ల కూతురు తనను అర్థం చేసుకుంటుందన్న ఆనందాన్ని తల్లి కూడా దాచుకోలేకపోయింది. తన ప్రాణం ఉన్నంత వరకు మీ కోసమే నేనంటూ ఆ తల్లి బదులిచ్చింది. ప్రస్తుతం ఆరేళ్ల చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియా వినియోగదారుల మనసును హత్తుకునేలా చేసింది. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌కి చాలా మంది లైక్‌లు, రెస్పాన్స్‌లు ఇచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల నుండి తమకు లభించిన ప్రేమపూర్వక బహుమతులు, లేఖలు గురించి ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Mar 01, 2023 09:33 PM