Hyenas-lion: హైనాల గుంపుతో సింహం ఒంటరి పోరాటం.. తగ్గేదేలే అంటోన్న మృగరాజు..
అడవిలో ప్రతి జంతువు జీవనం నిరంతర పోరాటమే. ఎటునుంచి ఏ జంతువు వచ్చి తనపై దాడి చేస్తుందోనని భయపడుతూనే ఉంటాయి. ఇందుకు అడవికి రాజైన సింహం కూడా మినహాయింపు కాదు..
అడవిలో ప్రతి జంతువు జీవనం నిరంతర పోరాటమే. ఎటునుంచి ఏ జంతువు వచ్చి తనపై దాడి చేస్తుందోనని భయపడుతూనే ఉంటాయి. ఇందుకు అడవికి రాజైన సింహం కూడా మినహాయింపు కాదు.. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైనాలు సింహాన్ని రౌండప్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ సింహాన్ని హైనాల గుంపు చుట్టుముట్టింది. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు 30 హైనా లు ఒక్క సింహాన్ని తమ ఆహారంగా చేసుకోడానికి శత విధాలా ప్రయత్నించాయి. కానీ మృగరాజు ఇక్కడ.. 30 కాదు.. అరవై హైనాలు వచ్చినా గర్జనతో తరిమికొడతానంటుంది సింహం. అన్ని హైనాలు చుట్టు ముట్టినా.. ఏ చిన్న పొరపాటు జరిగినా తను వాటికి ఆహారమైపోవడం ఖాయమని తెలిసినా.. ఏమాత్రం తొణకకుండా వాటిని తన గాంభీర్యంతోనే ఎదుర్కొంటుంది. అవి సింహంపై ఎటాక్ చేయడానికి ఎంత ప్రయత్నించినా హైనాలను గర్జనతోనే భయపెడుతుంది సింహం.. ఇలా కొంత సేపు జరిగిన అనంతరం.. సింహం అక్కడ దగ్గర్లో ఉన్న.. జంతు కళేబరాన్ని చూసింది.. హైనాలను పట్టించుకోకుండా.. మెల్లగా నడుచుకుంటూ.. తన ఆహారం దగ్గరకు వెళ్లి.. జాగ్రత్తగా అక్కడ కూర్చుని.. ఆహారాన్ని తినడం ప్రారంభించింది. అదే సమయంలో హైనాలు సింహాన్ని వెనుక నుండి చూస్తున్నాయి.. అంతేకాని సింహం దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఇదంతా అడవిలో సఫారీకి వెళ్లినవారు తమ కెమెరాల్లో బంధించారు. ఇదంతా కెన్యాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియో లక్షలమంది వీక్షించారు.. వేలల్లో లైక్ చేసారు. రారాజు ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?