Slow driving: చుక్కలు చూపిస్తున్న స్లో డ్రైవింగ్.. స్పీడ్ గా వెళ్లాలని చెప్పినా వినట్లే.. అసలు సంగతేంటంటే..

Slow driving: చుక్కలు చూపిస్తున్న స్లో డ్రైవింగ్.. స్పీడ్ గా వెళ్లాలని చెప్పినా వినట్లే.. అసలు సంగతేంటంటే..

Anil kumar poka

|

Updated on: Jul 07, 2022 | 11:05 AM

అవి సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు. కానీ వెహికిల్స్‌ మాత్రం కుందేలుకంటే దారుణంగా నడుస్తున్నాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు పెట్రోల్‌ ధరల పెంపుపై వినూత్న నిరసన చేపట్టారు.


అవి సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు. కానీ వెహికిల్స్‌ మాత్రం కుందేలుకంటే దారుణంగా నడుస్తున్నాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు పెట్రోల్‌ ధరల పెంపుపై వినూత్న నిరసన చేపట్టారు. ఇంగ్లండ్‌లో ప్రధాన మార్గాలపై ఎప్పుడూ దూసుకుపోయే వాహనాలు అతి నెమ్మదైపోయాయి. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌ ధరలపై చాలామంది స్లో డ్రైవింగ్‌ తో నిరసన తెలిపారు. స్లో డ్రైవింగ్‌ ప్రభావం ఇంగ్లండ్‌ , వేల్స్‌ను కలిపే M4 రోడ్‌పై బాగా కనిపించింది. ఈ మార్గంలో భాగంగానే ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ బ్రిడ్జి ఉంది. దీనిపై నిబంధనలకు విరుద్ధంగా గంటకు 48 కిలో మీటర్ల కంటే తక్కువ స్పీడ్‌తో వాహనాలు నడిపినందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 12 మంది వాహనాదారులను అరెస్ట్‌ చేశారు. పెట్రోల్‌ ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా పెట్రోల్ ధరల పెరుగుదలతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించాయి. అలాంటి ఉద్యోగులందరూ స్లో డ్రైవింగ్‌ నిరసనలో పాల్గొన్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ నిరసనకు ప్రచారం కల్పించారు. దీంతో వందలాది మంది ప్రధాన మార్గాల్లో స్లో డ్రైవింగ్‌కు దిగారు. దీంతో ఎప్పుడూ వాహనాలు వేగంగా దూసుకుపోయే హైవేలపై నత్తనడకన నడుస్తున్నట్టు కనిపించాయి. పోలీసులు వారిని ఫాలో అవుతూ స్పీడ్‌గా వెళ్లాలని చెప్పినా నిరసనకారులు పట్టించుకోలేదు. ఇంధన ధరలు తగ్గించే వరకు నిరసన కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 07, 2022 11:05 AM