బైకర్‌ను ఆపిన ట్రాఫిక్ పోలీస్.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బంజారాహిల్స్‌లో ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఒక వ్యక్తి వాహనంపై 42 పెండింగ్ చలాన్లు (రూ.16,665) వెలుగులోకి వచ్చాయి. హెల్మెట్, ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ఉల్లంఘనలకు అతను బాధ్యుడు. చలాన్లు చెల్లించ నిరాకరించడంతో పోలీసులు అతని యాక్టివాను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పెండింగ్ చలాన్లను పట్టించుకోకపోతే వాహనం సీజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘించేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లో నిర్వహించిన సాధారణ తనిఖీ ఒక ఆశ్చర్యకరమైన కేసును వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ యాక్టివా స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు వాహన నంబర్‌ను సిస్టంలో చెక్ చేసి నోరెళ్లబెట్టారు. సింగరేణి కాలనీ, సైదాబాద్‌కు చెందిన బి. ఆనంద్‌రాజు అనే వ్యక్తి యాక్టివా స్కూటర్‌తో కేబీఆర్ పార్క్ చౌరస్తా దాటుతుండగా ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపారు. ఆ సమయంలో అతడు హెల్మెట్ లేకుండా, ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్నాడు. దీంతో పోలీసులు ఆ వాహనంపై నమోదు అయిన చలాన్లను పరిశీలించగా ఒక్కసారిగా స్టన్ అయ్యారు. అతని బైక్‌పై మొత్తం 42 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. పెండింగ్ ఫైన్ మొత్తం రూ.16,665గా ఉంది. హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో 34 సార్లు అతనికి ఫైన్ పడింది. సెల్‌ఫోన్ డ్రైవింగ్ 4 సార్లు చేస్తూ పోలీసుల కెమెరాలకు చిక్కాడు. రాంగ్ రూట్‌లో సైతం నాలుగుసార్లు పట్టుబడ్డాడు. ఇదంతా చూసిన ట్రాఫిక్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. చట్టపరంగా చలాన్లు క్లియర్ చేయాలని పోలీసులు కోరినప్పటికీ, ఆనంద్‌రాజు చెల్లించబోనని స్పష్టంగా తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే అతడి యాక్టివా స్కూటర్‌ను సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. సాధారణంగా చాలా మంది చలాన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోరు. కెమెరాలకు చిక్కినా లెక్క చేయరు. కానీ ఒకసారి చెక్‌పోస్టులో వాహనం ఆగితే సీజ్ వరకు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం
40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే
బిగ్ బాస్ సీరియస్ ఆ ముగ్గురికీ రెడ్ కార్డ్ ??
అందం కోసం పాకులాడితే.. అంద విహీనంగా తయారయ్యే
స్మృతిని ఛీట్ చేసిన పలాష్ బయటపడ్డ ఎఫైర్! అందుకే పెళ్లి క్యాన్సిల్
