Yadadri Temple: చాక్ పీస్ తో యాదాద్రి టెంపుల్ !! కళానైపుణ్యానికి మెచ్చి సన్మానించిన ఆలయ ఈవో

|

Oct 23, 2023 | 9:58 AM

హైదరాబాద్ కు చెందిన సూరం సంపత్ కుమార్ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి భక్తుడు. చిన్నప్పటినుంచి ప్రతిభ పాటవాలు కలిగిన సంపత్ కుమార్ బొమ్మలు తయారు చేస్తుండే వాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పునర్ నిర్మించింది. స్వామివారి ఆలయాన్ని ఉద్ఘాటన తర్వాత సంపత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నాడు. ఆలయ కళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డాడు.

హైదరాబాద్ కు చెందిన సూరం సంపత్ కుమార్ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి భక్తుడు. చిన్నప్పటినుంచి ప్రతిభ పాటవాలు కలిగిన సంపత్ కుమార్ బొమ్మలు తయారు చేస్తుండే వాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పునర్ నిర్మించింది. స్వామివారి ఆలయాన్ని ఉద్ఘాటన తర్వాత సంపత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నాడు. ఆలయ కళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని చాక్ పీస్ లతో తయారు చేయాలని సంపత్ కుమార్ అనుకున్నాడు. దీంతో 8 వేల చాక్ పీసులతో మూడు నెలలపాటు శ్రమించి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నమూనాను తయారు చేశాడు. యాదాద్రి ఆలయంలోని అష్టభుజ ప్రాకార మండపం, వేంచేపు, కళ్యాణ మండపాలు, క్యూ లైన్లు, ఆలయ గోపురాలు, మాడవీధులు, రిటర్నింగ్ వాల్ ను చాక్ పీసులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. అనంతరం సంపత్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ నమూనాను యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డికి అప్పగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెడలో కొండచిలువతో సెల్ఫీ దిగాలనుకున్నాడు.. కానీ ??

Onion price rise: టమాటా శాంతించిందనుకుంటే.. ఇప్పుడు ఉల్లి షాకిస్తోంది

రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ

తెరుచుకున్న గాజా తలుపులు.. ఫలించిన అమెరికా మాస్టర్ ప్లాన్

మెట్రోలో ప్రయాణికుడికి ఇబ్బంది.. ఫైన్‌ కట్టిన మెట్రో

Follow us on