దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. గర్బా నృత్యం చేస్తూ 10 మంది
దసరా నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గుజరాత్‌లో ఉత్సవాల్లో భాగంగా గర్బా నృత్యం చేస్తూ 10 మంది కుప్పకూలిపోయారు. కేవలం 24 గంటల్లోనే ఇలా 10 మంది మృతి చెందడం కలకలం రేపింది. బాధితుల్లో యువత, మధ్య వయసు వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరణించినవారిలో బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. వయసుతో సంబంధం లేకుండా బలితీసుకుంటున్న గుండెపోట్లు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గుజరాత్‌లో ఉత్సవాల్లో భాగంగా గర్బా నృత్యం చేస్తూ 10 మంది కుప్పకూలిపోయారు. కేవలం 24 గంటల్లోనే ఇలా 10 మంది మృతి చెందడం కలకలం రేపింది. బాధితుల్లో యువత, మధ్య వయసు వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరణించినవారిలో బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. వయసుతో సంబంధం లేకుండా బలితీసుకుంటున్న గుండెపోట్లు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో గడిచిన కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు వరుసగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి కన్నుమూశాడు. కపద్వాంజ్‌కు చెందిన మరో 17 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా చనిపోయాడు. నవరాత్రుల మొదటి 6 రోజులలో గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి 108 అంబులెన్స్ సర్వీసులకు ఏకంగా 521 కాల్స్ వచ్చాయంటే అక్కడి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ నెయ్యి కిలో రూ.2 లక్షలు మాత్రమే.. అనేక రోగాలకు ఏకైక నివారిణి
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

