బిర్యానీ ఆర్డర్లల్లో హైదరాబాద్‌ టాప్ !! ఏడాదిలో కోటి బిర్యానీలు తినేశారు

|

Dec 18, 2023 | 7:27 PM

ఎప్పుడైతే ఆన్‌లైన్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చిందో.. అప్పటినుంచి అన్ని వ్యవహారాలూ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కూర్చున్న చోటునుంచి కదలకుండానే కోరుకున్నవన్నీ క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఆహారం విషయం చెప్పనక్కర్లేదు. ఒక్క ఆర్డర్‌తో ఇష్టమైన ఫుడ్‌ క్షణాల్లో వచ్చి వాలిపోతుంది. ముఖ్యంగా మహానగరాల్లోని ప్రజలకు ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డరివ్వడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో స్విగ్గీ, జొమాటోలకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.

ఎప్పుడైతే ఆన్‌లైన్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చిందో.. అప్పటినుంచి అన్ని వ్యవహారాలూ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కూర్చున్న చోటునుంచి కదలకుండానే కోరుకున్నవన్నీ క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఆహారం విషయం చెప్పనక్కర్లేదు. ఒక్క ఆర్డర్‌తో ఇష్టమైన ఫుడ్‌ క్షణాల్లో వచ్చి వాలిపోతుంది. ముఖ్యంగా మహానగరాల్లోని ప్రజలకు ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డరివ్వడం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో స్విగ్గీ, జొమాటోలకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. మరోవైపు, 2023 ఏడాది ముగింపు దగ్గరపడుతుండటంతో.. స్విగ్గీ ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్స్ వచ్చిన వంటకాల గురించి ఓ నివేదిక విడుదల చేసింది. హౌ ఇండియా స్విగ్గీడ్-2023 పేరిట విడుదలైన ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బిర్యానీపై హైదరాబాద్ నగరవాసుల అభిమానం మరోసారి తేటతెల్లమైంది. దేశంలోని నగరాల్లోకెల్లా హైదరాబాద్‌లో అత్యధికంగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, ఈ ఏడాది అత్యధికంగా స్విగ్గీలో అమ్ముడైన వంటకం కూడా బిర్యానీనే! వరసగా ఎనిమిదో ఏడాది బెస్ట్ ఆర్డర్డ్ డిష్‌గా బిర్యానీ నిలిచింది. సెకెనుకు 2.5 బిర్యానీలు అమ్ముడుపోయాయని నివేదికలో తేలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారిపై వీధి కుక్క అటాక్‌.. సీసీ కెమెరాలో రికార్డ్‌

రామయ్య తండ్రికి గోటి తలంబ్రాల కోసం పంట కోతలు..

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌ !!

మంచు దుప్పటి కప్పుకున్న మన్యం జిల్లా.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

రైతన్నలను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు