Wax Statue: జన్మనిచ్చిన తల్లిని మరిచిపోలేక.. పెళ్లి వేడుకలో తల్లి మైనపు విగ్రహం.
విధి ఆడిన వింత నాటకంలో తల్లిని కోల్పోయాడు ఓ యువకుడు. ఆయినా ఆమె పట్ల ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. తన తల్లి లేకుండా పెళ్లి చేసుకోలేనని వాదించాడు. చివరికి ఒక కొడుకు కోరిక అతని తండ్రిని ఆలోచించేలా చేసింది. ఏకంగా తల్లి రూపం మైనపు బొమ్మగా రూపుదిద్దుకుంది.నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మర్రి గోవిందరాజులు భార్య శ్రీదేవి అనారోగ్యం పాలైంది.
విధి ఆడిన వింత నాటకంలో తల్లిని కోల్పోయాడు ఓ యువకుడు. ఆయినా ఆమె పట్ల ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. తన తల్లి లేకుండా పెళ్లి చేసుకోలేనని వాదించాడు. చివరికి ఒక కొడుకు కోరిక అతని తండ్రిని ఆలోచించేలా చేసింది. ఏకంగా తల్లి రూపం మైనపు బొమ్మగా రూపుదిద్దుకుంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మర్రి గోవిందరాజులు భార్య శ్రీదేవి అనారోగ్యం పాలైంది. చికిత్స పొందుతూ ఆమె కోలుకోలేక మూడు నెలల క్రితం ప్రాణాలు విడిచింది. అయితే తన కుమారుని వివాహ వేడుకల్లో తల్లి లేని లోటు ఉండకూడదని ఉద్దేశంతోనే విగ్రహాన్ని తయారు చేయించారు. ఆగస్ట్ 25న హైదరాబాద్‌లో జరగబోయే తన కుమారుని వివాహానికి తన సతీమణిని తీసుకెళ్తున్నట్లు భర్త గోవిందరాజులు, కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీదేవి అనారోగ్యనికి గురవడంతో భర్త గోవిందరాజులు మనోవేదన గురై తన కుమారుని వివాహంలో తల్లి లేని లోటును తీర్చాలనుకున్నారు. శ్రీదేవి మైనపు విగ్రహాన్ని అచ్చం మనిషిని పోలినట్లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కుమారుని పెళ్లికి మూడు రోజుల ముందే విగ్రహాన్ని తయారు చేయించి ఇంటికి తీసుకువచ్చారు. విగ్రహం అచ్చం శ్రీదేవిని పోలి ఉండటంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు భావోద్వేగానికి లోనయ్యారు. భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి భర్త తన ప్రేమను చాటుకున్నారు. తన భార్యని మర్చిపోలేక విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకున్న గోవిందరాజును స్థానికులు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...