Viral: తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..

|

Jul 17, 2024 | 12:12 PM

విధి ఎంత విచిత్రమైనదో అనిపిస్తుంది ఈ సంఘటన గురించి తెలిస్తే. ఆ ఒక్క రాత్రి గడిస్తే వాళ్లు బతికే వాళ్ళు.. తెల్లారితే గృహప్రవేశం.. కొత్త ఇంట్లోకి వెళుతున్నాం అన్న సంతోషంతో తమ కల సాకారమైందని కలలు కంటూ నిద్రపోయిన ఆ దంపతులకు అదే చివరి రాత్రి అయ్యింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగికి చెందిన మారెప్ప, లక్ష్మి దంపతులు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు.

విధి ఎంత విచిత్రమైనదో అనిపిస్తుంది ఈ సంఘటన గురించి తెలిస్తే. ఆ ఒక్క రాత్రి గడిస్తే వాళ్లు బతికే వాళ్ళు.. తెల్లారితే గృహప్రవేశం.. కొత్త ఇంట్లోకి వెళుతున్నాం అన్న సంతోషంతో తమ కల సాకారమైందని కలలు కంటూ నిద్రపోయిన ఆ దంపతులకు అదే చివరి రాత్రి అయ్యింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగికి చెందిన మారెప్ప, లక్ష్మి దంపతులు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేసే మారెప్ప దంపతులు కష్టపడి రూపాయి.. రూపాయి కూడబెట్టి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం మారెప్ప దంపతులు కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారి త్వరగా లేవాలి.. శుభముహూర్తంలో కొత్త ఇంట్లో అడుగు పెట్టాలనుకున్న ఆ దంపతులు తమ పాత పెంకుటింటిలో నిద్రపోయారు. ఇక మళ్లీ లేవలేదు. రాత్రి కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలి మారెప్ప, లక్ష్మి దంపతులపై పడింది. దీంతో భార్యాభర్తలిద్దరూ శిథిలాల కింద పడి చనిపోయారు. పక్కనే వేరే గదిలో నిద్రిస్తున్న కూతురు, కుమారుడు, మరో బంధువు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో తమ జీవితం ఆనందమయంగా ఉంటుందని ఎన్నో కలలుగన్నవారికి అదే చివరి రాత్రి అయింది. ఈ ఒక్క రాత్రి గడిస్తే ఆ దంపతులు బతికే వాళ్ళు అని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.