Hunt for Diamonds: వజ్రాల వేటకు పరుగులు పెడుతున్న వందలాది మంది.. సందడిగా కృష్ణా నదీ తీరం..
తొలకరి జల్లు కురిసిందంటే చాలు. అక్కడికి జనం పరుగులు పెడతారు. ఒక్కరో ఇద్దరో కాదు. వందలాది మంది. ఇంతకీ ఎందుకంటారా? వర్షాకాలం మొదలైతే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వజ్రాల వేట మొదలౌతుంది.
తొలకరి జల్లు కురిసిందంటే చాలు. అక్కడికి జనం పరుగులు పెడతారు. ఒక్కరో ఇద్దరో కాదు. వందలాది మంది. ఇంతకీ ఎందుకంటారా? వర్షాకాలం మొదలైతే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వజ్రాల వేట మొదలౌతుంది. ఒకనాడు వజ్రాలకు పెట్టని కోటగా ఉన్న కృష్ణాతీరంలో ఇప్పుడు జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.వజ్రాల కోసం పెద్ద ఎత్తున్న అన్వేషణ సాగిస్తోన్న వేటగాళ్ళతో కృష్ణాతీరం సందడిగా మారింది. కంచికచర్ల పరిధిలోని పరిటాల, చందర్లపాడు, గుడిమెట్ల తదితర ప్రాంతాల్లో వానజల్లు కురిసిందంటే ఇప్పటికీ వజ్రాల కోసం వేట మొదలౌతుంది. ఒక్కరో ఇద్దరో కాదు. ప్రతిరోజూ 300 మందికి పైగా పనికి వెళ్లినట్టు చద్దికట్టుకెళ్ళి, వజ్రాలకోసం పొద్దుపోయే వరకు వెతుకుతారు.లక్కు తగిలిందా లక్షాధికారే. లేకపోయినా అక్కడ దొరికే రంగు రంగుల రాళ్ళతో కూలి గిట్టుబాటు అవడం ఖాయం. అయితే మరోవైపు ప్రభుత్వం కృష్ణాతీరంలో వజ్రాల తవ్వకాలపై నిషేధం విధించింది. వజ్రాల అన్వేషణ నిషేధమన్న పోలీసుల హెచ్చరికలను లెక్కచేయని వజ్రాల వేటగాళ్లు తమ పనిలో తామున్నారు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

