గుడ్‌న్యూస్‌.. తగ్గిన టూ వీలర్స్‌ ధరలు వీడియో

Updated on: Sep 13, 2025 | 3:20 PM

ద్విచక్ర వాహనం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇటీవల కేంద్రం సవరించిన జీఎస్టీ ప్రభావం టూ వీలర్స్ పరిశ్రమలపై చూపుతోంది. జీఎస్టీ సవరణలో భాగంగా 350 సీసీ లోపు బైకులు, స్కూటర్లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ అండ్ స్కూటర్ ఇండియా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

హోండా తెలిపిన వివరాల ప్రకారం వినియోగదారులు ఎంపిక చేసుకునే మోడల్ ను బట్టి గరిష్టంగా 18,887 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. ధరలు తగ్గుతున్న మోడళ్లలో యాక్టివా, డీయో, యూనికార్న్, షైన్, సీబీ 350 సిరీస్ లున్నాయి. అయితే ఈ ధరల తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని సంస్థ స్పష్టం చేసింది. హోండా సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాధుర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని హోండా స్వాగతిస్తుంది. దీనివల్ల ద్విచక్ర వాహనాలు మరింత అందుబాటులోకి వస్తాయి. వినియోగదారులకు ఇది మంచి ఊరటనిస్తుందని మేము నమ్ముతున్నాం అని పేర్కొన్నారు. అయితే 40 శాతం జీఎస్టీ స్లాబులోకి వచ్చే కొన్ని ప్రత్యేక మోడళ్లపై ధరల ప్రభావాన్ని కంపెనీ ఇంకా పరిశీలిస్తుందని హోండా తెలిపింది. వాటిపై నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉందని వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం :

ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో

ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్‌ ఐడియా వీడియో

ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో

హైదరాబాద్‌ నుంచి 3 హై స్పీడ్ రైలు మార్గాలు వీడియో