యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!

Updated on: Jan 13, 2026 | 3:45 PM

విశ్వాసానికి మారుపేరు శునకం. పట్టెడన్నం పెట్టి...కాస్త ప్రేమగా చూస్తే చాలు.. జీవితాంతం యజమానిపట్ల తన విశ్వాసం కలిగి ఉంటుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. అలాంటి ఓ శునకం తన యజమానిని కాపాడుకునే ప్రాణాలను సైతం లెక్కచేయక వీరోచితంగా పోరాడి ఓడింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది.

ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన పెంపుడు శునకం తనకోసం ప్రాణాలు వదలడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు ఆ యజమాని. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లా మదన్‌పుర్‌ గైబువా గ్రామంలో, రైతు రక్షిత్‌ పాండే తన పెంపుడు శునకం ‘పైలట్‌’తో కలిసి చెరకుతోటలో కోతలకు వెళ్లాడు. అక్కడ అకస్మాత్తుగా రైతుపై దాడి చేసింది పులి. వెంటనే అలర్టయింది శునకం. పులిని అడ్డుకొని, యజమానిని కాపాడేందుకు ‘పైలట్‌’ వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడిన పైలట్‌ అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు చేరుకునేలోపే పులి పారిపోయింది. శునకం మృతితో యజమాని కన్నీరుమున్నీరయ్యారు. యజమానికోసం ప్రాణాలర్పించిన శునకాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..

బ్రష్​ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి

నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం