Hema: మీడియాపై హేమ చిందులు.. హేమ డ్రామాలు నెక్స్ట్ లెవల్..
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్ లోని జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని విధించారు. అంతకుముందు రేవ్ పార్టీ గురించి సీసీబీ పోలీసులు ఆమెను వేర్వేరు కోణాల్లో విచారించారు. ఐదుగురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించి, జడ్జి ఎదుట హాజరుపరిచారు.

మీడియా నుంచి తప్పించుకోడానికి బురఖాలో వచ్చారు హేమ. వైద్య పరీక్షల అనంతరం హేమను పోలీసులు బయటకు తీసుకువచ్చిన సమయంలో ఆమె మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఇప్పుడే తనను ఇక్కడ ఆసుపత్రికి తీసుకు వచ్చారన్నారు. పరీక్షల కోసం తన హెయిర్, యూరిన్, నెయిల్ శాంపిల్స్ ఇప్పుడే తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రగ్స్ కేసులో తన శాంపిల్స్ ఇదివరకు తీసుకోకపోయినా మీడియా ఎలా నిర్ధారిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.
గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. అయితే మొదట ఆ రేవ్ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది హేమ. కానీ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు రావాలని హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. అనేక కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే హేమను అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.